అనసూయ, రష్మి గౌతమ్ ఎక్కడ మొదలుపెట్టి.. ఎక్కడి వరకు..

అనసూయ.. రష్మి.. ఇద్దరూ హాట్ యాంకర్లే. పైగా ఇద్దరూ ఒకే షో నుంచి పాపులర్ అయిన వాళ్లే. అంతకుముందు ఇద్దరికీ ఇమేజ్ లేదు. జబర్దస్థ్ అనే ఒక్క ప్రోగ్రామ్ తో ఇటు అనసూయ.. అటు రష్మి జాతకాలు మారిపోయాయి. ఇద్దరూ నమ్ముకున్నది అందాల ప్రదర్శననే. బుల్లితెరపై వీళ్ల అందాల తాకిడికి స్క్రీన్లు వేడెక్కిపోయాయి. ఆ వేడిని మరింత పెంచడానికి దర్శకులు ఈ ఇద్దరు ముద్దుగుమ్మల్ని సినిమాల్లోకి తీసుకొచ్చారు. ఆ మధ్య క్షణంతో అనసూయ.. గుంటూర్ టాకీస్ తో రష్మి వెండితెరపై కూడా మెరిసారు. అప్పటినుంచి ఇద్దరూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా అనసూయ రంగస్థలం లాంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటే.. రష్మి గౌతమ్ వరసగా హాట్ సినిమాలు చేసి స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకుంది.
ఈ ఇద్దరూ పాపులర్ అయింది జబర్దస్థ్ అనే షో తోనే. దీనికి ముందు కూడా అనసూయ, రష్మి ఇండస్ట్రీలోనే ఉన్నారు. కానీ ఆ విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఈ ఇద్దరూ కొన్ని సినిమాల్లో కూడా నటించారు. అనసూయనే తీసుకోండి.. ఈ భామ అప్పుడెప్పుడో 16 ఏళ్ల కింద జూనియర్ ఎన్టీఆర్ నటించిన నాగలో కాసేపు మెరిసింది. అప్పట్లో అనసూయ అంటే ఎవ్వరికీ తెలియదు. దాంతో ఈ భామను ఎవ్వరూ పట్టించుకోలేదు కూడా. ఆ ఫోటోలు ఈ మధ్యే బయటికి వచ్చాయి. వాటిలో అనసూయను గుర్తుపట్టడం కూడా కష్టమే.
ఇక రష్మి కూడా అంతే. జబర్దస్థ్ లో సెగలకు ముందు.. కరెంట్ సినిమాలో ఫుల్ లెంత్ రోల్ లో నటించింది. ఎవరూ పట్టించుకోలేదు. అంతకుముందు 14 ఏళ్ల కింద ఉదయ్ కిరణ్ హోలీలో సునీల్ కు గాళ్ ఫ్రెండ్ గా నటించింది. అయినా బ్రేక్ రాలేదు. కానీ గుంటూర్ టాకీస్ లో రష్మి చేసిన రచ్చతో దెబ్బకు స్టార్ అయిపోయింది. ఆ తర్వాత కేవలం ఆమె ఫోటోలు మాత్రమే పోస్టర్లపై వేసి నిర్మాతలు సొమ్ము చేసుకున్నారు. అంత క్రేజ్ సంపాదించుకుంది రష్మి గౌతమ్. మొత్తానికి ఇప్పుడు స్టార్ స్టేటస్ అనుభవిస్తున్న అనసూయ, రష్మి గతంలోకి వెళ్లి చూస్తే భలే కామెడీగా అనిపిస్తుంది కదూ..!