English   

షాకిచ్చిన జక్కన్న...ఆర్ఆర్ఆర్ అప్పుడే 

RRR
2020-02-01 11:25:34

దర్శకధీరుడు రాజమౌళికి ఒక చెడ్డ పేరుంది అదేంటంటే ఆయన చెప్పిన టైంకి సినిమా రిలీజ్ చేయడని, గతంలో ఆయన మాట మీద నిలబడి సినిమా అనుకున్న సమయానికి రిలీజ్ చేసిన దాఖలాలు తక్కువే. అయితే సినిమా క్వాలిటీ తదితరాల విషయంలో ఆయన అలా లేట్ చేశుంటారు. ఇక ఆయన తాజాగా  తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్. బాహుబలిని మించేలా ఈ చిత్రాన్ని 400 కోట్ల బడ్జెట్ లో నిర్మిస్తున్నారు. 

ఎన్టీఆర్, రాంచరణ్ అభిమానులతో పాటు దేశవ్యాప్తంగా సినీ ప్రేముకులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్న ఈ సినిమా స్వాతంత్ర ఉద్యమానికి ముందు ఉండనుంది. ఇక ఈ సినిమా షెడ్యూల్ ప్రస్తుతం వికారాబాద్ అడవుల్లో జరుగుతోంది. షూటింగ్ ప్రారంభమైన ఆరంభంలోనే ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని 2020 జులై 30న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. 

కానీ షూటింగ్ లో జరుగుతున్న ఆలస్యం కారణంగా ఆర్ఆర్ఆర్ విడుదల దసరాకు వాయిదా పడ్డట్లు ప్రచారం జరిగింది. ఈ వార్తలని ఆర్ఆర్ఆర్ టీం కూడా ఖండించలేదు. తాజా సమాచారం మేరకు రాజమౌళి అభిమానులకు షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ దసరా రిలీజ్ కూడా వాయిదా పడిందట. దసరా కంటే వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడమే బెటర్ అని రాజమౌళి భావిస్తున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది జనవరి 9న ఈ సినిమా రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమా రిలీజ్ గురించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

More Related Stories