English   

గబ్బర్ సింగ్ కాంబినేషన్ రిపీట్స్.. హరీష్ శంకర్‌తో పవన్..

Pawan Harish Shankar
2020-02-01 11:56:59

హ‌రీష్ శంక‌ర్.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌న్నెండేళ్ళ ఆశ‌లకు తెర‌దించిన ద‌ర్శ‌కుడు. గబ్బ‌ర్ సింగ్ తో రికార్డులు తిర‌గ‌రాసిన ద‌ర్శ‌కుడు. కానీ ఆ త‌ర్వాతే ఈయ‌న‌కు చుక్క‌లు క‌నిపిస్తున్నాయి. రామ‌య్యా వ‌స్తావ‌య్యా ఫ్లాప్.. సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ హిట్టైనా అది పెద్ద హీరో సినిమా కాదు. ఆ తర్వాత డిజే, గద్దలకొండ గణేష్ లాంటి సినిమాలతో పర్లేదనిపించాడు ఈ దర్శకుడు. ఇదంతా ఇలా ఉంటే.. కొన్ని రోజులుగా ఈయన ప‌వ‌న్ కోసం ఓ క‌థ సిద్ధం చేసిన‌ట్లు వార్తలొస్తున్నాయి. ఇదే విషయాన్ని ఆయన కూడా చెప్పాడు. త్వరలోనే పవన్ ను కలిసి కథ చెప్తానని కూడా క్లారిటీ ఇచ్చాడు. 

అయితే రాజకీయాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ ఈ దర్శకుడికి ఓకే చెప్తాడా లేదా అనే అనుమానాలు అందరిలోనూ ఉండేవి. అయితే పింక్ సినిమా రీమేక్ తో పవన్ రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ చిత్రం ఉండగానే క్రిష్ సినిమాను కూడా మొదలుపెట్టాడు. ఈ రెండు సినిమాలను 10 రోజుల గ్యాప్ లోనే మొదలుపెట్టి సంచలనం సృష్టించిన పవన్.. ఇప్పుడు మూడో సినిమాకు కూడా ఓకే చెప్పాడు. హ‌రీష్ శంక‌ర్ కాంబినేష‌న్ లో ఈయన సినిమా చేయబోతున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించింది. గ‌బ్బ‌ర్ సింగ్ తర్వాత మరోసారి కాంబినేషన్ రిపీట్ కానుండటంతో పండగ చేసుకుంటున్నారు అభిమానులు. ఈ సినిమాపై మరిన్ని వివరాలు వీలైనంత త్వరగా చెప్పనున్నారు నిర్మాతలు.

More Related Stories