English   

స్కూల్ టీచర్ గా ఆనంద్ దేవరకొండ

Anand Deverakonda
2020-02-01 12:03:23

సెన్సేషనల్ హీరో విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం వరల్డ్ ఫేమస్ లవర్ అనే సినిమాని రిలీజ్ చీసుకునే పనిలో ఉన్నాడు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని తమ్ముడిని కూడా హీరోను చేసుకున్నాడు. అయితే ఈయన రెండో సినిమా గురించి రకరకాల ప్రచారం జరిగింది. అయితే ఈ విషయాలు ఏవీ కన్ఫాం కాలేదు కానీ మరో కొత్త ప్రచారం మొదలయ్యింది. అదేంటంటే ఈయన రెండో సినిమా భవ్య క్రియేషన్స్ లో ఉండనుందని కూడా ప్రచారం జరిగింది. 

భవ్య క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 12గా తెరకెక్కనున్న సినిమాలో ఆనంద్ హీరోగా ఎంపికయ్యాడని రచయితగా పలు సినిమాలకి పని చేసిన వినోద్ అనంతోజు అనే ఆయన ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నాడని ప్రచారం జరుగుతోంది. అయితే ఆ సినిమా సంగతి ఏమో కానీ అప్పుడే మనోడు మూడో సినిమా కూడా ఫైనల్ చేశాడట. 

దామోదర అట్టాడ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న ఆనంద్ ఈ సినిమాలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా కనిపించబోతున్నాడట. ప్రస్తుతం హైదరాబాద్‌ లో ఈ సినిమా షూటింగ్‌ కూడా జరుగుతుందని సమాచారం. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో ఆనంద్‌ సరసన ఇద్దరు కొత్త హీరోయిన్స్ నటించనున్నట్టు చెబుతున్నారు. టాంగా ప్రొడక్షన్స్‌ బ్యానర్ మీద విజయ్‌ మట్టపల్లి, ప్రదీప్‌ ఎర్రబెల్లిలు ఈ సినిమా నిర్మిస్తున్నట్టు సమాచారంరు. టైటిల్ త్వరలోనే రివీల్ చేయచ్చని అంటున్నారు.  

More Related Stories