English   

టాలీవుడ్ కి మరో స్టైలిష్ విలన్ దొరికేశాడు

 Tollywood
2020-02-01 14:16:14

నిన్న నాగశౌర్య హీరోగా నటించిన అశ్వద్దామ సినిమా రిలీజ్ అయింది. సినిమా లైన్ బాగున్నా ఎగ్జిక్యూషన్ తేడా పడడంతో కాస్త నెగటివ్ టాక్ వచ్చింది. అయితే సినిమా ఎలా ఉంది అనే దాని కంటే కలెక్షన్స్ మీదే హిట్ ఆధారపడి ఉందని పెద్దగా చెప్పక్కర్లేదు. అయితే ఇప్పుడు ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మాట్లడుకోవాలంటే ముందుగా కధ బాగుందని చెప్పాలి. ఆ తర్వాత శౌర్య ఫైట్స్ అలాగే స్టంట్స్. 

ఇక ఆ తర్వాత చెప్పుకోవాల్సింది ఈ సినిమాలో విలన్ గురించే.  'అశ్వత్థామ' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు విలన్ గా పరిచయం అయ్యాడు బెంగాలీ నటుడు జిషు సేన్ గుప్తా. ఇది ఆయనకు తెలుగులో మొదటి సినిమా అనుకుంటే పప్పులో కాలేసినట్టే ఎందుకంటే ఆయన ముందుగా హిందీ మణికర్ణికలో   ఝాన్సీ రాజ్య చక్రవర్తి గంగాధర్ రావుగా నటించారు. ఆ సినిమా తెలుగులో కూడా రిలీజయ్యింది. ఆ తరువాత ఎన్టీఆర్ బయోపిక్ లో ఎల్వీ ప్రసాద్ గా నటించాడు. ఇక ఇది తెలుగులో ఆయనకి రెండో సినిమా అని చెప్పచ్చు. 

అలా విలనీగా మొదటి సినిమాకే తన విలనిజంతో మెప్పించాడు జిషు. అయితే కొత్త దర్శకుడే ఇంతలా నటింపచేశాడంటే బోయపాటి లాంటి వాళ్ళ చేతిలో పడుంటే అతని రేంజ్ మరోలా ఉంటుందనడంలో సందేహం లేదు. నిజానికి విలన్ ని పరిచయం చేస్తే కధ బయటకి వస్తుందని ముందు చూపుతో విలన్ ని ఎక్కడా ఏ ఎవీంట్ లోనూ పరిచయం చేయకుండా అతని పేరు కూడా బయటికి రాకుండా జాగ్రత్త పడ్డారు మేకర్స్. కానీ రిలీజ్ తర్వాత శౌర్య కంటే ఎక్కువగా అతని గురించే మాట్లాడుకుంటున్నారు. అంతే మరి రాసిఉంటే.

More Related Stories