English   

నిహారిక దానికే పరిమితమా ..మరి అక్కడ పనేంటి 

Konidela Niharika
2020-02-01 14:54:29

మెగా డాటర్ నిహారిక కొణిదెలకు ఉన్న సోషల్ మీడియా ఫాలోయింగ్ గురించి తెలిసిందే. హీరోయిన్ గా ఒకటి రెండు సినిమాలు చేసి చేతులు కాల్చుకున్నా అందగత్తె, మాటకారి కావడంతో సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ఫాలోవర్స్ ఉన్నారు. మెగా బ్రాండ్ ఈ నటవారసురాలికి కొంతవరకే ఉపయోగపడింది. ఉపయోగపడడం కంటే అడ్డం అనే చెప్పాలి, ఎందుకంటే ఎక్స్పోజింగ్ లాంటివి చేయలేదు, బోల్డ్ పాత్రలు గురించి ఆలోచనే రాకూడదు. పక్కింటమ్మాయి ముద్ర పడడంతో సినిమాలని పక్కన పెట్టి వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంది. డిజిటల్ స్ట్రీమింగ్ లోనైనా రాణించాలని మెగా ప్రిన్సెస్ ప్రత్యేకించి దానిపైనే దృష్టి పెట్టింది. 

ఈమధ్య తన ఇన్స్టా స్టోరీలో ముంబైకి వెళ్లిన సంగతి షేర్ చేసింది. అయితే ముంబై ట్రిప్ ఎందుకు అనేది మాత్రం అక్కడ నిహారిక వెల్లడించలేదు. నిహారిక హైదరాబాద్ తిరిగి వచ్చినా ఆ ట్రిప్ గురించి వివరాలేమీ చెప్పలేదు. అయితే ఆరా తీయగా ముంబై లో నిహారిక ఒక ప్రముఖ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ ఆధ్వర్యంలో ఫోటోషూట్ లో పాల్గొందని సమాచారం. అయితే ఆ ఫోటో షూట్ ఎందుకనే విషయం బైటకు రానీయలేదు. ఎందుకంటే బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ నిర్మించే ఒక వెబ్ సీరీస్ కోసమే ఆ ఫోటో షూట్ చేసిందని ఆ మేకర్స్ చెప్పేదాకా విషయం బయటకు రానీయద్దని అనుకున్తున్తున్నారు. మన వెబ్ సిరీస్ కొంచెం పద్దతిగానే ఉంటాయి, మరి బాలీవుడ్ వెబ్ సిరీస్ లో ఈ అమ్మడు ఏమి చేయనుంది అనేది ఆసక్తికరంగా మారింది.

More Related Stories