English   

పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ కలిసి నటించబోతున్నారా..

 Renu Desai
2020-02-01 16:25:45

పవన్ కళ్యాణ్ సినిమాలో రేణుదేశాయ్ నటించబోతుందనే వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తున్నాయి. ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుందనే రూమర్స్ వస్తేనే మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఒకవేళ నిజమైతే మాత్రం నిజంగానే అదో పెద్ద సంచలనమే. వీళ్లిద్దరూ కలిసి నటిస్తే చూడాలని చాలా రోజులుగా అభిమానులు కూడా వేచి చూస్తున్నారు. 

రేణు దేశాయ్ ను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసింది పవన్ కళ్యాణే. ఆయన నటించిన బద్రి సినిమాతోనే టాలీవుడ్ కి వచ్చింది రేణు దేశాయ్. ఆ తర్వాత జానీ సినిమాలో నటించింది. అప్పటికే పవన్ కళ్యాణ్ తో ప్రేమలో పడటంతో సహజీవనం మొదలుపెట్టారు. ఇక ఆ తర్వాత సినిమాలకు దూరమైపోయింది రేణు. పవన్ ను పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన సినిమాలకు డిజైనర్ గా వర్క్ చేసింది. విడిపోయిన తర్వాత మళ్లీ సినిమాలపై ఫోకస్ చేసింది రేణు దేశాయ్. 

దర్శకురాలిగా రైటర్ గా సత్తా చూపించే ప్రయత్నం చేస్తుంది ఈమె. ఇదిలా ఉంటే తాజాగా పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా పింక్ సినిమా రీమేక్లో ఒక చైల్డ్ ఆర్టిస్ట్ తల్లి పాత్రలో నటించబోతోందని ప్రచారం జరుగుతోంది. వేణు శ్రీరామ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. దిల్ రాజు, బోని కపూర్ నిర్మాతలు. ఒకవేళ అన్నీ కుదిరి పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే మాత్రం మెగా అభిమానులకు అంతకంటే కావలసింది ఇంకేమీ ఉండదేమో..?

More Related Stories