English   

పవన్ కళ్యాణ్, క్రిష్ సినిమాకు అజ్ఞాత నిర్మాతలు..

Pawan Krish
2020-02-01 17:21:47

పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒకేసారి రెండు సినిమాలు చేస్తున్నాడు. అందులో ఒక సినిమాను దిల్ రాజుతో బోనికపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరో సినిమా ఏఎం రత్నం నిర్మాణంలో జరుగుతుంది. క్రిష్ ఈ సినిమాకు దర్శకుడు. 100 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రం రాబోతుందని తెలుస్తుంది. అయితే పవన్ కళ్యాణ్, క్రిష్ సినిమాకు ఎంతమంది నిర్మాతలు ఎవరు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 

మొన్న సినిమా మొదలైనప్పుడు శ్రీ సూర్య మూవీస్ కాకుండా మెగా సూర్య మూవీస్ అని కనిపించింది. ఏఎం రత్నం నిర్మాణ సంస్థ పేరు శ్రీ సూర్య మూవీస్.. కానీ అక్కడ మాత్రం మెగా అని ఎక్స్ ట్రా కనిపించింది. అంటే దీనికి మెగా కుటుంబం నుంచి కూడా నిర్మాతలు ఉన్నారా అనే సందేహం ఇప్పుడు అభిమానుల్లో కలుగుతుంది. చిరంజీవి భార్య సురేఖకు చాలా రోజుల నుంచి పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలనేది ఒక కోరిక. ఒకవేళ ఆమె ఈ నిర్మాణంలో భాగస్వామిగా ఉందా అనే ప్రచారం కూడా జరుగుతోంది. 

దాంతోపాటు పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ పేరుమీద ఈ సినిమాలో షేర్ ఉందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనా కూడా క్రిష్ సినిమా నిర్మాత కేవలం ఏఎం రత్నం మాత్రమే కాదు మెగా కుటుంబం నుంచి కూడా ఆయనకు సపోర్టు లభిస్తుందని తెలుస్తోంది. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా వస్తుంది.

More Related Stories