English   

ముసుగు దొంగగా మారిపోయిన అల్లు అర్జున్..

 Allu Arjun
2020-02-01 18:10:41

సినిమా హీరోలు కూడా మనుషులే.. వాళ్లకు కూడా కొన్ని కోరికలు ఉంటాయి. సాధారణ ప్రేక్షకుల మాదిరే వాళ్లకు కూడా థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడాలని ఉంటుంది. అయితే అది అంత ఈజీ కాదు. వాళ్లు థియేటర్కు వస్తే ప్రేక్షకులు సినిమా చూడటం మానేసి వాళ్లను చూస్తూ కూర్చుంటారు. దాంతో పాటు హీరోలు బయటికి వస్తే చాలా ఇబ్బందులు పడతారు. అందుకే థియేటర్లో సినిమా చూడాలి అనుకున్న కూడా స్టార్ హీరోలు బయటకు వచ్చే సాహసం చేయరు. కానీ కొందరు మాత్రమే వేషాలు వేసుకొని వచ్చి థియేటర్లలో సినిమాలు చూసి వెళ్తుంటారు. 

అల్లు అర్జున్ కూడా ఇదే చేస్తాడు. ఈ విషయం చెప్పింది కూడా ఆయనే. తనకు ఇంట్లో థియేటర్ ఉన్నా కూడా.. బయటికి వచ్చి నచ్చిన సినిమాలను థియేటర్లలో చూడటానికి ఇష్టపడతానని చెబుతున్నాడు బన్నీ. కానీ ఆయనకు ఉన్న ఇమేజ్ కారణంగా బయటికి వస్తే సినిమాలు చూడలేడు.. అందుకే మాస్క్ వేసుకొని థియేటర్లలోకి వచ్చి నచ్చిన సినిమా చూసి వెళ్ళిపోతానని చెబుతున్నాడు అల్లు అర్జున్. 

గతంలో చాలా సినిమాలు ఇలాగే థియేటర్ కు వచ్చే సాధారణ జనం మధ్య సినిమాలో చూశానని.. మొన్న అల వైకుంఠపురంలో సినిమా కూడా ఇలాగే థియేటర్ కు మాస్క్ కట్టుకొని వచ్చి జనాల మధ్య చూసి ఎంజాయ్ చేశానని చెబుతున్నాడు ఈ హీరో. దాంతో పాటు మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా థియేటర్లోనే చూసాడు అల్లు అర్జున్. మొత్తానికి ఫేస్ మాస్క్ బన్నీకి బాగా హెల్ప్ చేసింది.

More Related Stories