హరీష్ - పవన్ స్టోరీ లీక్...అదేనా...

గబ్బర్ సింగ్ తర్వాత మరోసారి పవన్.. హరీష్ శంకర్‌తో కలిసి పనిచేయబోతున్నారు. ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ట్విటర్ ద్వారా నిన్న ప్రకటించింది. గతంలో పవన్, హరీష్ కాంబినేషన్లో ‘గబ్బర్ సింగ్’ సినిమా వచ్చి భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు ‘పింక్’ తెలుగు రీమేక్‌తో బిజీగా ఉన్నారు పవన్. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే తొలి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి చేసేశారు. పింక్ రీమేక్ లో లాయర్ గా, క్రిష్ సినిమాలో దొంగగా నటిస్తున్న పవన్ కళ్యాణ్ ని మాస్ మిర్చి డైరెక్టర్ అయిన హరీష్ శంకర్ ఎంత ఘాటుగా, నాటుగా ప్రెజెంట్ చేస్తాడా అని అప్పుడే చాలా అంచనాలు పెట్టేసుకున్నారు ఫ్యాన్స్. ఎప్పుడో తేరి రీమేక్ కోసం పవన్ కి ఇచ్చిన అడ్వాన్స్ మైత్రి వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ సెట్ చేసింది.
హరీష్ పవన్ ఫ్యాన్ కావడంతో సినిమా రికార్డుల మోత మోగడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి చిరు కోసం హరీష్ శంకర్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారని వార్తలు వినిపించాయి. అయితే అది చిరు కోసం కాదని పవన్ కోసమని క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమా అంతా పొలిటికల్ డ్రామాగా నడుస్తుందని అంటున్నారు. అది పవన్ పొలిటికల్ గా కూడా మైలేజ్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నట్టు చెబుతున్నారు. ఇక ఈ సినిమాని వచ్చే ఏడాది సమ్మర్‌కి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.