యాంకర్ ప్రదీప్‌పై ఫిర్యాదు...అమ్మాయిని వేధించి...

యాంకర్, నటుడు ప్రదీప్ పై పోలీసులకి ఫిర్యాదు అందడం సంచలనంగా మారింది. అది కూడా ప్రదీప్‌పై ఓ యువ దర్శకుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ నిబంధనలకు విరుద్ధంగా రెండు రోజుల జైలు శిక్ష అనుభవించిన ప్రదీప్ ఓ సినిమాలో హీరోగా నటిస్తున్నారని ఇది నిబంధనలకు పూర్తి విరుద్ధమని ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో దర్శకుడు శ్రీరామోజు సునిశిత్ ఫిర్యాదు చేశారు. నిన్న మేడ్చల్ జిల్లా కీసరలోని రాంపల్లికి చెందిన సునిశిత్ ఈ మేరకు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గత నెల 31న తాను టీవీ చూస్తుండగా ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే సినిమాలో ప్రదీప్ మాచిరాజు ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లుగా తెలిసిందన్న ఆయన గతంలో ఒక అమ్మాయిని వేధించిన ఘటనలో రెండు రోజులపాటు జైలుకు వెళ్లి వచ్చాడని ఆయన పేర్కొన్నారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ రూల్స్ కు వ్యతిరేకంగా ప్రదీప్ ఈ సినిమా చేస్తున్నాడని, ఈ రూల్స్ తెలీక దర్శకుడు కూడా రూల్స్ అతిక్రమించి సినిమా చేస్తున్నారని పేర్కొన్నారు. వెనువెంటనే 30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాా ఆయన పోలీసులను ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు, న్యాయసలహా అనంతరం కేసు నమోదుచేస్తామని తెలిపారు.