నయనతార దోపిడీ...నిర్మాత సంచలన ఆరోపణలు...

లేడీ ఒరిఎంటేడ్ సినిమాలు ఎక్కువగా చేసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుని లేడీ సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకుంది నయనతార. నయనతార కోసం సెట్స్‌లో పెట్టే ఖర్చులు తన కొంప ముంచాయి అని ప్రముఖ తమిళ నిర్మాత రాజన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. నయనతార ఏదన్నా సినిమా సెట్‌కు వెళితే ఆమెతో పాటు ఏడుగురు అసిస్టెంట్స్ కూడా ఉండి తీరాల్సిందేనట. వారికి ఒక్కొక్కరికి రోజుకి ఏడు నుంచి ఎనిమిది వేల రూపాలయ వరకు జీతం నిర్మాతలే సమర్పించుకోవాలని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ సహాయకులందరి రోజు వారీ ఇచ్చే జీతం మొత్తం కలిపి 80000 దాకా ఉంటుంది.
ఇవి కాక ఆమె కారు డ్రైవర్, ఆమె డీజిల్ ఖర్చులు కూడా నిర్మాతే చెల్లించాల్సి ఉంటుందట. అలాగే ప్రతి సినిమాకు క్యారావాన్ ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయని పెద్ద సినిమాలు అంటే క్యారావాన్ల కోసమే దాదాపు కోటి ఖర్చు చేయాల్సి ఉంటుందని రాజన్ సంచలన ఆరోపణలు చేశారు. నయనతార ప్రస్తుతం రజనీకాంత్ తో 168వ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాను విశ్వాసం దర్శకుడు శివ తెరకెక్కిస్తున్నాడు.