English   

రేపిస్ట్ చెన్నకేశవులు భార్యను కలిసిన వర్మ..సినిమా కోసం

rgv
2020-02-02 19:11:29

నిర్భయ ఘటన తర్వాత ఇటీవల జరిగిన దిశ అత్యాచారం ఘటన దేశాన్ని మరోసారి ఉలిక్కిపడేలా చేసింది. దిశపై అత్యాచారం, అనంతరం హతమార్చిన వాళ్లను ఉరి  తీయాలంటూ జనాలు రోడ్డెక్కెలా చేసిందా ఘటన. ఇక...ఈ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్ ఘటనపై సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. తన తదుపరి చిత్రం దిశ అని తెలిపారు వర్మ. ఇక...దిశ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుంటున్నారు వర్మ. నిందితుల కుటుంబాల గురించి కూడా వివరాలు సేకరిస్తున్నారాయన. ఈ కేసులో నిందితుడు చెన్న కేశవులు భార్య రేణుకను దర్శకుడు రాంగోపాల్ వర్మ కలిశారు. దిశ కేసు నిందితుడు చెన్నకేశవులు...అతని భార్య రేణుకకు భవిష్యత్తు లేకుండా చేశాడని వర్మ మండిపడ్డారు. 'రేణుక 16 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకుందని తెలిపారు వర్మ. 17 ఏళ్లకే ఒక బిడ్డకు జన్మనివ్వబోతుందన్నారు. చెన్న కేశవులు దిశను మాత్రమే కాకుండా.. అతని భార్య రేణుకను కూడా బాధితురాలిగా మార్చాడని ట్వీట్ చేశారు సంచలన దర్శకుడు. వాడి వల్ల ఒక బాలిక మరో పాపకు జన్మనిస్తుందని అన్నారు. ఇప్పుడు వారిద్దరికీ భవిష్యత్తు లేకుండా పోయింది అంటూ ట్వీట్‌ చేశారు వర్మ.

 

More Related Stories