English   

నిఖిల్ పెళ్లి.. ప్రేమించిన అమ్మాయితోనే నిశ్చితార్థం..

nikil
2020-02-02 19:18:19

వరస విజయాలతో తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో నిఖిల్. ఈయన త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నాడు. ఇప్పటికే నితిన్ పెళ్లి కన్ఫర్మ్ అయిపోయింది. ఫిబ్రవరి 15న ఈయన నిశ్చితార్థం జరగనుంది. ఇక ఇప్పుడు నిఖిల్ కూడా పెళ్లి పీటలెక్కబోతున్నాడు. ఈయన తాను ప్రేమించిన పల్లవి వర్మను పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈమె డాక్టర్.. కొన్ని రోజులుగా పల్లవితో ప్రేమలో ఉన్నాడు నిఖిల్. ఈ విషయం ఇంట్లో చెప్పి రెండు ఫ్యామిలీస్ ను ఒప్పించాడు ఈ కుర్ర హీరో. అందరిముందే ప్రపోజ్ చేసి తన ప్రేమను చూపించాడు నిఖిల్. ప్రస్తుతం ఫ్యామిలీ వెకేషన్ లో ఉన్నాడు ఈ హీరో. అందులో కొన్ని ఫోటోలు బయటికి వచ్చాయి. సోషల్ మీడియాలో నిఖిల్ ఎంగేజ్ మెంట్ ఫోటోలిప్పుడు సందడి చేస్తున్నాయి. పల్లవి వర్మతో ఈయన దిగిన ఫోటోలు కొన్ని ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. పెళ్లి డేట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు కానీ సమ్మర్ లో అనుకుంటున్నారు. పెళ్లి మాత్రం చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు నిఖిల్ కుటుంబ సభ్యులు. ప్రస్తుతం ఈయన కార్తికేయ 2 సినిమాలో నటిస్తున్నాడు. ఈ మధ్యే నిఖిల్ నటించిన అర్జున్ సురవరం మంచి విజయం సాధించింది.

More Related Stories