English   

సందడి లేకుండా పెళ్లి చేసుకున్న కుర్ర హీరో..

marriage
2020-02-02 19:47:57

ఇంత ఇండస్ట్రీలో పెళ్లి చేసుకునే బాగానే మోగుతున్నాయి వరుసగా హీరోలు అంతా సోల్ మేట్స్ వెతుక్కునే పనిలో పడ్డారు ఇప్పుడు మరో కుర్రహీరో కూడా ఇదే చేసాడు తెలుగులో లేడీస్ & జెంటిల్ మెన్, రన్, బ్యాక్ బెంచ్ స్టూడెంట్ సినిమాలలో నటించి గుర్తింపు తెచ్చుకున్న మహాత్ రాఘవేంద్ర ఫిబ్రవరి 1న పెళ్లి చేసుకున్నాడు కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ కుర్ర హీరో ప్రేమించిన అమ్మాయి ప్రాచీ మిశ్రాని వివాహం చేసుకున్నాడు. తమిళనాడులోని ఓ బీచ్‌ సమీపంలో హిందూ సంప్రాదాయంలో మహత్‌, ప్రాచీల పెళ్లి జరిగింది. వీళ్లిద్దరి నిశ్చితార్థం 2019 లో ఘనంగా జరిగింది. ఒప్పుకున్న సినిమాల కారణంగా కెరీర్లో కాస్త బిజీగా ఉండటంతో పెళ్లి కోసం ఎక్కువ టైం తీసుకున్నాడు మహత్ రాఘవేంద్ర. ఇప్పుడు పెళ్లి మాత్రమే కాదు అప్పుడు నిశ్చితార్థం కూడా చాలా సైలెంట్ గా చేసుకున్నాడు

ఈయన. మహాత్-ప్రాచిల పెళ్లి వేడుకకు కుటుంబ సభ్యులతో పాటు కొద్ది మంది సన్నిహితులు హాజరయ్యారు. తమిళ సినీ ప్రముఖులు శింభు, అనిరుధ్‌లు కూడా పెళ్లికి హాజరైన వారిలో ఉన్నారు. ఇదిలా ఉంటే పెళ్లికి మూడు రోజుల క్రితం మహత్‌ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ చేశాడు. అందులో ప్రాచీతో తన ప్రయాణం గురించి రాసుకొచ్చాడు మహత్. తమిళంలో మంకాత, బిరియాని, వడకర్రి, చెన్నై 600028 II, అన్బనవన్ అసరాధవన్ అదన్గాదవన్, వందా రాజవాతాన్ వరువేన్ లాంటి సినిమాల్లో నటించాడు. మొత్తానికి కుర్రహీరో పెళ్లి చేసుకోవడంతో అతని స్నేహితులు బంధువులు అంతా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

More Related Stories