English   

నాగశౌర్య యాక్షన్ హీరోగా సక్సెస్ అయినట్లేనా..

nag
2020-02-02 20:31:54

ఇండస్ట్రీలో కొంత మంది హీరోలకు ఎంత మంచి ఇమేజ్ ఉన్న కూడా మాస్ ఇమేజ్ కావాలని కోరుకుంటారు. లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న వాళ్లు కూడా అప్పుడప్పుడు యాక్షన్ సినిమాలు చేస్తుంటారు. దానికి కారణం మాస్ ఇమేజ్ ఉంటే కలెక్షన్లు ఎక్కువగా వస్తాయి. క్రేజ్ కూడా త్వరగా పెరుగుతుంది. అందుకే ఇప్పుడు నాగశౌర్య కూడా ఇదే చేశాడు. ఈయన నటించిన అశ్వద్ధామ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది. ఇప్పటివరకు లవర్ బాయ్ గా ఉన్న నాగశౌర్య పూర్తిస్థాయి మాస్ హీరోగా మారి చేసిన సినిమా ఇది. దీనికోసం ఆయన సొంతంగా కథ కూడా రాసుకున్నాడు. ఇందులో మంచి పాయింట్ తీసుకున్న కూడా దాన్ని తెరకెక్కించే విధానంలో మాత్రం చాలా లోపాలు కనిపించాయి అంటున్నారు విశ్లేషకులు. అందుకే కలెక్షన్ల విషయంలో చాలా వెనకబడి పోయింది.

ఇప్పటివరకు తొలి రెండు రోజుల్లో కేవలం కోటి 20 లక్షలు మాత్రమే వసూలు చేసింది అశ్వథ్థామ. ఈ సినిమాని దాదాపు ఎనిమిది కోట్ల వరకు బిజినెస్ చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే అశ్వద్ధామ సినిమాకు అన్ని కోట్లు రావడం కష్టంగానే కనిపిస్తోంది. చలో సినిమా తర్వాత సరైన విజయం కోసం చూస్తున్న నాగశౌర్యకు అశ్వద్ధామ బ్రేక్ ఇస్తుందని నమ్మారు ప్రేక్షకులు కూడా. కానీ ఈ సినిమా కూడా పెద్దగా ప్రభావం చూపించడం లేదు. ముఖ్యంగా నాగశౌర్య యాక్షన్ బాగానే ఉన్నా కూడా స్క్రీన్ ప్లే విషయంలో తేలిపోవడంతో సినిమా కూడా పెద్దగా వర్కవుట్ కాలేదు. కథనం విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉండుంటే సినిమా కచ్చితంగా నాగ శౌర్య కోరుకున్నట్లే పెద్ద విజయం సాధించి ఉండేది. కానీ అలా జరగలేదు. ఏదేమైనా కూడా యాక్షన్ హీరోగా ఒక ప్రయత్నం చేశాడు నాగశౌర్య. మరి దాన్ని మిగిలిన దర్శకులు కంటిన్యూ చేస్తారా లేదా అనేది చూడాలి.

 

More Related Stories