లుక్ తో అదరగొడుతున్న విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా `ఇస్మార్ట్` డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఓ స్పోర్ట్స్ డ్రామాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. లవర్స్ డే సందర్భంగా వరల్డ్ ఫేమస్ లవర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న విజయ్ దేవరకొండ పూరీ సినిమా జనవరి 20న తొలి షెడ్యూల్ ముంబైలో జరుపుకుంది. నిన్నటితో ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి అయినట్టు తెలుస్తుంది. ఇక హైదరాబాద్లో రెండో షెడ్యూల్ని మరి కొద్ది రోజులలో మొదలు పెట్టనున్నారని చెబుతున్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్గా కనిపించనున్నారు. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని పూరి కనెక్ట్స్ బ్యానర్ పై ఛార్మి నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బడా దర్శకనిర్మాత కరణ్ జోహార్ ఈ చిత్ర నిర్మాణ భాగస్వామిగా ఉన్న ఈ సినిమా మీద అంచనాలు భారీగానే ఉన్నాయి. తాజాగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా యూనిట్ నిన్న విమానాశ్రయంలో మెరిశారు. ఇందులో విజయ్ లుక్ ని పరిశీలిస్తే ఫిజిక్ పరంగా చాలా మార్పులే కనిపిస్తున్నాయి. బాడీని షేపప్ చేశాడని అంటున్నారు. ఫైటర్ చిత్రంలో దేవరకొండ లాంగ్ హెయిర్ తో కనిపించనున్నాడని అర్ధం అవుతోంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ మూవీ.. వేసవి చివరలో తెరపైకి వచ్చే అవకాశముంది