English   

రేస్ మొదలు పెట్టిన పవన్ కళ్యాణ్...

Pawan Kalyan latest.jpg
2020-02-03 07:35:57

ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ అంటే రాజకీయాలు చేస్తూ బిజీగా ఉండిపోయాడు. కానీ ఇప్పుడు అలా కాదు. ఆయన వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఒకటి రెండు కాదు ఏకంగా మూడు సినిమాలు కన్ఫర్మ్ చేశాడు పవన్ కళ్యాణ్. అది కూడా నెల రోజుల గ్యాప్ లోనే. ఈ మూడు సినిమాలకు కలిపి దాదాపు 140 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు పవర్ స్టార్. ఇది ఇలా పక్కన పెడితే తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి తరువాత నెంబర్ వన్ ఎవరు అనే ప్రశ్నకు సమాధానంగా ఇప్పటివరకు కేవలం మహేష్ బాబు పేరు మాత్రమే వినిపిస్తుంది.

ప్రభాస్ బాహుబలి చేసినా కూడా అది రాజమౌళి ఖాతాలోకి వెళ్లిపోయింది. దాంతో ఇమేజ్ పరంగా చూసుకుంటే మహేష్ బాబు అందరికంటే ముందున్నాడు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ కావడంతో ఆయన తాత్కాలికంగా రేపు నుంచి తప్పుకున్నాడు. మళ్లీ సినిమాలు చేస్తాడో లేదో అనే సిచువేషన్ నుంచి ఒకేసారి మూడు సినిమాలు కన్ఫర్మ్ చేసే ఫ్యాన్స్ అందరికీ ట్రీట్ ఇచ్చాడు పవర్ స్టార్. దాంతో బాక్సాఫీస్ దగ్గర పవన్ కళ్యాణ్ మేనియా మళ్ళీ మొదలై పోయినట్లే. ముఖ్యంగా పవన్ సినిమా హిట్ అయితే ఆ ప్రభావం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అందుకే పవన్ కళ్యాణ్ సినిమాలు కన్ఫర్మ్ చేసిన తర్వాత అభిమానులు పండగ చేసుకుంటున్నారు. వేణు శ్రీరామ్, క్రిష్ ఇద్దరు చిన్న దర్శకులు. కానీ పవన్ కళ్యాణ్ ఇమేజ్ పెద్దది. సరిపోయే సినిమా పడితే బాక్సాఫీస్ రికార్డులను కచ్చితంగా పవన్ కళ్యాణ్ జోరు ముందు సైడ్ ఇస్తాయి. ఇక హరీష్ శంకర్ సినిమా కూడా కన్ఫర్మ్ చేశాడు పవన్ కళ్యాణ్. ఈ కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్ ఎలాంటి సంచలన విజయం సాధించిందో చెప్పనక్కర్లేదు. మైత్రి మూవీ మేకర్స్ ఇప్పుడు వీళ్ళ సినిమా చేస్తుంది. ఈ మూడు సినిమాల్లో ఏ రెండు విజయం సాధించిన కూడా కచ్చితంగా పవన్ కళ్యాణ్ మళ్లీ రేసులోకి వచ్చినట్లే. మరో నాలుగేళ్లపాటు చేయడానికి రాజకీయాలు కూడా ఏమీ లేవు. అందుకే సినిమాలు చేద్దామని ఫిక్స్ అయిపోయాడు పవన్ కళ్యాణ్.

More Related Stories