English   

రజనీ రెమ్యునరేషన్ అన్ని కోట్లా 

Darbar
2020-02-03 11:32:48

సూపర్ స్టార్ రజనీకాంత్ భవిష్యత్తు ఏమిటో ఎవరికీ అర్ధం కావడం లేదు. ఒకవైపు రాజకీయాల్లోకి వెళ్లేలా కనిపిస్తు మరో వైపు సినిమాలు కూడా వరుసగా ఒప్పుకుంటున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలతో ఆయన రాజకీయ తెరంగ్రేటం చేయచ్చని అంటున్నారు. ఆ లోపు వీలైనన్ని సినిమాలు చేసేస్తున్నా అందులో ఒక్కటి కూడా ఆయన స్థాయికి తగ్గ హిట్ అనిపించుకోవడం లేదు. ఆ సినిమాలకు వసూళ్లు భారీ స్థాయిలో ఉన్నా.. ఆ వసూళ్లు వాటి బడ్జెట్ స్థాయిలో ఉండటం లేదు. ఆయన కెరీర్ లో దర్బార్ కూడా దేబ్బెసింది. 

మొన్న సంక్రాంతికి రిలీజయిన ఈ సినిమా పేరులో ఉన్న ఊపు సినిమాలో లేకపోవడంతో ఆ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. వసూళ్లు వచ్చినా ఆ సినిమా బడ్జెట్ కు వ్బాటికి పొంతనే లేకుండా పోయింది. ఆ సినిమా మేకింగ్ ఖర్చులో 50 శాతం వరకూ హీరో రెమ్యూనరేషనే ఉందని అతున్నారు. ఆ సినిమా బడ్జెట్ దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు కాగా.. అందులో 108 కోట్ల రూపాయలు రజనీకాంత్ తన రెమ్యూనరేషన్ గా తీసుకున్నారట. ఆయన తర్వాత నయనతార కూడాభారేగా వసూలు చేసిందట. అలా వీరికే అంత అయితే ఇంకా ఆ ఎఫెక్ట్ సినిమా మీద పడకుండా ఎలా ఉంటుంది చెప్పండి. 

More Related Stories