English   

టాలీవుడ్ మీద పడిన కరోనా వైరస్ 

Corona Virus
2020-02-03 11:39:15

కరోనా వైరస్...చైనాలో పుట్టిన మేడిన్ చైనా వైరస్ పేరు వింటేనే జనాలు బెంబేలెత్తిపోతున్నారు. రోజు రోజుకు ఈ వైరస్ దేశాలు, రాష్ట్రాలను దాటేస్తోండడంతొహ్ అందరూ జాగ్రత్త పడుతున్నారు. ఇక కరోనా ప్రభావం టాలీవుడ్ పై పడినట్టే. ఎందుకంటే మన వాళ్ళు షూట్ కోసం రెగ్యులర్ గా బ్యాంకాక్ థాయ్ ల్యాండ్ సహా కొన్ని పర్సనల్ టూర్స్ కి పలు ఎగ్జోటిక్ లొకేషన్లకు టూర్లు వెళ్లే సెలబ్రిటీలు కూడా ఇప్పుడు అప్రమత్తమయిపోయారట. 

అంత ఎందుకు ప్రతి సినిమాకి స్క్రిప్టు రాసేందుకు ఆ తర్వాత రిలాక్స్ అయ్యేందుకు సైతం బ్యాంకాక్ - థాయ్ ల్యాండ్ కి వెళ్లే పూరి జగన్నాథ్ సైతం గోవాతో సరిపెట్టుకుంటున్నారట. అలాగే థాయ్ ల్యాండ్ లోని అడవుల్లో షూటింగ్ కోసం ప్రిపరేషన్స్ చేసుకున్న బన్ని- సుకుమార్ టీమ్ పైనా ఈ ప్రభావం ఉందని అంటున్నారు. ఇప్పటికే కొన్ని ట్రిప్స్ ప్లాన్ చేసుకున్న పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా విమానం టిక్కెట్లు క్యాన్సిల్ చేసుకున్నారని భోగట్టా. ఒక వైరస్ దెబ్బకు సెలబ్రిటీలంతా ఒణికిపోతున్నారు. అవును లే వైరస్ కి సెలబ్రిటీనా కామన్ మ్యానా అని తేడా ఏముంది అందరికీ చుక్కలు చూపించడం తప్ప.

More Related Stories