మరో క్రేజీ మల్టీస్టారర్...మహేష్ తో దేవరకొండ

టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సక్సెస్‌ను విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నాడు. తన 27వ చిత్ర దర్శకత్వ బాధ్యతలను వంశీ పైడిపల్లికి అప్పగించిన ఆయన రిలాక్స్ అవుతున్నాడు. సరిలేరు సక్సెస్ మీట్లో ‘మహర్షి, సరిలేరు’ సినిమాల కంటే గొప్ప చిత్రాన్ని అభిమానులకు అందిస్తానని వంశీ మాటిచ్చాడు. అయితే ఈ సినిమాలో టాలీవుడ్ సెన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్నట్టు సమాచారం.
విజయ్ కోసం వంశీ స్పెషల్ క్యారెక్టర్ రూపొందిచనట్టు చెబుతున్నారు. అయితే ఈ చిత్రంలో విజయ్‌ది కీలక పాత్రా లేక అతిథి పాత్రా అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో మహేష్ ఓ గ్యాంగ్ స్టర్ గా నటించనున్నాడని అంటున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ సినిమాలో మహేష్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. గతంలో మహేష్ ,వంశీ కాంబినేషన్ లో మహర్షి అనే సినిమా వచ్చి మంచి ఘన విజయం సాధించడంతో ఈ సినిమాపైన భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందించనున్నారు.