సరిలేరు నీకెవ్వరు మూడు వారాల కలెక్షన్స్

వరుస విజయాలతో సూపర్ స్టార్ ఫామ్ ఉన్నాడు. మొన్న సంక్రాంతికి సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరుతో మరో బ్లాక్బస్టర్ తన ఖాతాలో వేసుకున్నారు. సినిమా రిలీజ్ రోజు మొదలుకొని నేటివరకూ ఈ సినిమా వసూళ్ల ప్రవాహం కొనసాగుతూనే ఉంది.మూడు వారాలు అవుతున్నా దాటినా ఈ సినిమా కలెక్షన్స్ జోరు కొనసాగుతోంది.
మొదటి వారంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో 84 కోట్ల సాధించిన ఈ సినిమా రెండో వారం పూర్తయ్యే సరికి టాప్ తెలుగు రాష్ట్రాల్లో 106.6 కోట్ల షేర్ని సాధించి ఆల్టైమ్ రికార్డు సాధించి మహేష్ కెరీర్ లో ది బెస్ట్ సినిమాలో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం మూడు వారాలు తరువాత 118 కోట్ల షేర్ సాధించిన ఈ సినిమా వరల్డ్ వైడ్గా 140 కోట్లకు మించి షేర్ని వసూలు చేసిందని అంచనా.
ఈ సినిమాకి ఇంత భారీ వసూళ్లు రావడానికి చాలా కారణాలున్నాయి. చాలా రోజుల తరువాత మహేష్ బాబు మాస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక సినిమా ఫుల్ రన్ లో ఎంత సాధిస్తుందో చూడాలి.