English   

అల వైకుంఠపురములో మూడు వారాల కలెక్షన్లు

Ala Vaikunthapurramuloo
2020-02-03 12:10:02

త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కిన తాజా సినిమా అల వైకుంఠపురములో. సంక్రాంతికి రిలీజయిన ఈ సినిమా మూడు వారాలు దాటినా రికార్డు స్థాయి వసూళ్లు సాధిస్తూనే ఉంది. తొలివారమే బయ్యర్లు అందర్నీ సేఫ్ జోన్‌కు తీసుకొచ్చిన ఈ సినిమా మూడో వారం కూడా దుమ్ము లేపింది. కేవలం రెండో వారంలోనే 12 కోట్ల షేర్ వసూలు చేసిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా అవతరించింది. నాన్ బాహుబలిలో అన్ని రికార్డులను తన పేరు మీద రాసేసుకున్నాడు బన్నీ. 

ముఖ్యంగా తొలిరోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో బన్నీ దూకుడుకు అడ్డే లేకుండా పోయింది. ఇక 'అల వైకుంఠపురములో' చిత్రం 3 వారాల కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి : నైజాం 41.84 కోట్లు, సీడెడ్ 17.64 కోట్లు, ఉత్తరాంధ్ర 18.95 కోట్లు, ఈస్ట్ 10.93 కోట్లు, వెస్ట్ 8.60 కోట్లు, కృష్ణా 10.28 కోట్లు, గుంటూరు 10.70 కోట్లు, నెల్లూరు 4..42 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 11.62 కోట్లు, ఓవర్సీస్ 18.08 కోట్లు, వరల్డ్ వైడ్ టోటల్ 153.06 కోట్లు. 

నిజానికి 'అల వైకుంఠపురములో' సినిమా 85 కోట్ల బిజినెస్ జరిగింది. విడుదలైన 6 రోజుల్లోపే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం.. 21 రోజులు పూర్తయ్యేసరికి తెలుగు రాష్ట్రాల్లో…123.36 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. ఇక ఫుల్ రన్ కంప్లీట్ అయ్యేసరికి ఈ చిత్రం 165 కోట్ల షేర్ ను రాబట్టే అవకాశం కూడా ఉందని ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు.  

More Related Stories