English   

మొదటి కుటుంబ కథా చిత్రంతో వస్తున్న నటి షకీలా..

Shakeela
2020-02-03 12:51:33

ష‌కీలా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈమె పేరు అప్పట్లో సంచలనం. ఈమె సినిమా వచ్చిందంటే స్టార్ హీరోలు కూడా భయపడేవాళ్ళు. అయితే తెలుగులో కాకుండా మళయాలంలో షకీలా సినిమాలు సంచలనాలు సఋష్టించాయి. ఇప్పుడు ఈమె హీరోయిన్ గా ఓ సినిమా వస్తుంది. విక్రాంత్, పల్లవి ఘోష్ జంటగా 24 క్రాఫ్ట్స్ బ్యానర్ పై సీవీ రెడ్డి సమర్పణలో సి.హెచ్ వెంకట్ రెడ్డి నిర్మాత‌గా సాయిరాం దాసరి దర్శకత్వ పర్యవేక్షణలో సతీష్ వి.ఎన్ దర్శకత్వం వహించిన  చిత్రం 'షకీలా రాసిన మొట్ట మొదటి కుటుంబ కథాచిత్రం'. 

ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్స్ ఆవిష్కరణ ఫిబ్రవరి 2న ఫిల్మ్ చాంబర్లో జరిగింది. ఈ కార్య‌క్ర‌మంలో న‌టి షకీల పాల్గొంది. అక్కడ ఈమె మాట్లాడుతూ తాను నిర్మించిన 'లేడీస్ నాట్ అలౌడ్' సినిమా పది నెలలుగా సెన్సార్ అవడం లేదని తెలిపింది. ఎంతో వల్గారిటీతో వచ్చిన సినిమాలు రిలీజ్ అయ్యాయని.. కానీ మా సినిమాకే సెన్సార్ వాళ్లు ఎందుకు అభ్యంతరాలు చెపుతున్నారో అర్థం కావడం లేదని ఆమె వాపోయింది. 

ప్రస్తుతం ట్రిబ్యునల్ లో ఉందని.. షకీలా అంటే వల్గారిటీ సినిమాలేనా.. ఫ్యామిలీ సినిమాలు చేయదా అనే విమర్శలున్నాయని.. అందుకే అన్ని రకాల సినిమాలు చేయగలనని నిరూపించడం కోసం కుటుంబ కథాచిత్రంగా ఈ సినిమా చేస్తున్నానని తెలిపింది నటి షకీలా. అయితే తన పేరు చూస్తేనే సెన్సార్ ఇవ్వడం లేదని.. ఇది తాను రాసిన కథ అంటే ఇంకా ఎన్ని ఇబ్బందులు పెడతారో. కానీ ఇది ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని తెలిపింది షకీలా.

More Related Stories