English   

మనీష్ మల్హోత్రా డిజైనర్ వేర్‌లో కుమ్మేసిన రామ్..

Ram Pothineni
2020-02-03 14:15:40

యంగ్ హీరో రామ్ ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన స్టైల్.. పద్దతులు అన్నీ మార్చేసాడు. అప్పటి వరకు చాలా స్టైలిష్ గా.. క్లాస్ హీరోగా కనిపించిన ఈ కుర్ర హీరో ఇప్పుడు మాత్రం ఫుల్ మాసీగా కనిపిస్తున్నాడు. ఎక్కడికి వచ్చినా కూడా తన లుక్ తో పిచ్చెక్కిస్తున్నాడు. ముఖ్యంగా రామ్ ను చూసి అమ్మాయిల గుండెలు అలా జారిపోతున్నాయి. 

ఇప్పుడు కూడా ఇలాంటి కిరాక్ లుక్ తో ఫిదా చేసాడు రామ్. తాజాగా మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన దుస్తుల్లో అదరగొట్టాడు మన ఇస్మార్ట్ శంకర్. మొన్నటికి మొన్న చేతిలో కత్తిలో ఫుల్ కిక్ ఇచ్చిన రామ్.. ఇప్పుడు పూర్తిగా దేశీ లుక్ లోకి మారిపోయాడు. బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ లో భాగంగా హైదరాబాద్ HICC హోటల్లో జరిగిన ఈవెంట్ కు రామ్ కూడా వచ్చాడు. అయితే అక్కడికి వచ్చింది ఆయన కేవలం గెస్టుగా మాత్రమే కాదు.. మోడల్ గా కూడా. మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన దుస్తుల్లో కనిపించి కాక పుట్టించాడు రామ్. 

అదిరిపోయే గెటప్ లో ఉన్న రామ్ ను చూసి అక్కడున్న వాళ్లే కాదు అంతా వావ్ అనేసారు. ఈ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఈయన రెడ్ సినిమాలో నటిస్తున్నాడు. కిషోర్ తిరుమల తెరకెక్కిస్తున్న ఈ చిత్రం తమిళ హిట్ తడమ్ కు రీమేక్. మేలో సినిమా విడుదల కానుంది. మొత్తానికి అటు సినిమా.. ఇటు మోడలింగ్ చేస్తూ బిజీగా ఉన్నాడు ఈ కుర్ర హీరో.

More Related Stories