English   

పవన్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ కన్నుమూత.. పాడెమోసిన మంత్రి..

Pawan Kalyan
2020-02-03 16:27:30

మొన్నటికి మొన్న మెగా ఫ్యాన్స్ హైదరాబాద్ అధ్యక్షుడు నూర్ భాయ్ చనిపోయాడు. ఇది మరిచిపోక ముందే మరో చేదువార్త కూడా వచ్చింది. తాజాగా మరో మెగా అభిమానుల సంఘం అధ్యక్షుడు చనిపోయాడు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ హఠాన్మరణం ఇప్పుడు అభిమానులను కంటతడి పెట్టిస్తుంది. 

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో బందరు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దాసరి లక్ష్మణ రావు(బుడ్డా) గుండెపోటుతో కన్నమూసారు. ఈయన మంత్రి పేర్ని నానికి సన్నిహితుడు. లక్ష్మణ రావుకు అత్యంత సన్నిహితుడు సుధాకర్ ఈ మధ్యే యాక్సిడెంట్ లో చనిపోయాడు. అప్పటి నుంచి కూడా ఈయన ముభావంగా ఉన్నాడు. ఏదో కోల్పోయినట్లు చాలా సైలెంట్ అయిపోయాడు అంటున్నారు కుటుంబ సభ్యులు. 

ఆ బాధలో ఉన్న లక్ష్మణరావుకు ఉన్నట్లుండి హార్ట్ ఎటాక్ వచ్చిందని.. అప్పుడే ఆయన మరణించారని తెలిపారు ఫ్యామిలీ మెంబర్స్. వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించినా కూడా ఫలితం లేకుండా పోయింది. ఈయన అంతిమయాత్రలో ఏపీ మంత్రి పేర్ని నానితో పాటు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర లక్ష్మణరావు పాల్గొన్నారు.. ఆయన పాడె కూడా మోశారు. జిల్లాకు చెందిన పలువురు ప్రముఖులు లక్ష్మణరావు భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.

More Related Stories