English   

అశ్వద్ధామ మూడు రోజుల కలెక్షన్స్

Ashwatthama
2020-02-03 17:56:28

టాలీవుడ్ యువ హీరో నాగ శౌర్య నటించిన అశ్వద్ధామ ఇటీవల రిలీజ్ అయింది. సొంతంగా స్టోరీ రాసుకొని నాగశౌర్య నటించడంతో ఈ సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మాస్ యాక్షన్ కలగలిపి ఉన్న ఈ సినిమాకి మిక్సిడ్ టాక్ వచ్చింది. అయితే టాక్ తో సంబంధం లేకుండా ఈ సినిమాకి కలెక్షన్లు ఓ రేంజ్ లో వస్తున్నాయి. ఇప్పటిదాకా ఈ సినిమాకి సంబంధించి వచ్చిన కలెక్షన్లను చూస్తే నాగశౌర్య కెరీర్లోనే బెస్ట్ ఓపెనింగ్స్‌ ఈ సినిమా దక్కించుకున్నట్లు చెబుతున్నారు. 

మూడు రోజుల్లో ఈ సినిమా 10 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిందంటూ పోస్టర్స్ విడుదల చేశారు మేకర్స్'. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 7 కోట్ల దాకా జరిగింది. అలా చూసుకుంటే 8 కోట్లు వస్తే కానీ బ్రేక్ ఈవెన్ కాదు. అయితే ఈ సినిమాకి మూడు రోజుల్లో దాదాపు 5 కోట్ల వరకు షేర్ వచ్చినట్లు అంచనా. మరో మూడు కోట్లు వస్తే కానీ నాగశౌర్య హిట్ కొట్టినట్లు కాదు. 

వీకెండ్ బాగానే క్యాష్ చేసుకున్నా వీక్ డేస్‌లో ఉండే కలెక్షన్స్ ని బట్టే బ్రేక్ ఈవెన్ సాధ్యమా కాదా ? అనేది తేలిపోనుంది. ఓపెనింగ్స్ బాగా వచ్చాయి కాబట్టి ఎక్కడా ఏ చిన్న విషయాన్నీ వదలకుండా ప్రమోషన్స్ చేసుకుంటున్నారు శౌర్య. రెండు తెలుగు రాష్ట్రాలలో అశ్వద్దామ థియేటర్స్‌ సంఖ్యను పెంచినట్టు వార్తలు వస్తున్నాయి. అదే నిజిం అయితే శౌర్య సినిమాకి కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.

More Related Stories