English   

రవితేజ కెరీర్ అంత దారుణంగా పడిపోయిందా..

Ravi teja
2020-02-03 18:04:49

డిస్కో రాజా సినిమాకి వచ్చిన కలెక్షన్లు చూసిన తర్వాత అందరికీ వచ్చే అనుమానం ఇదే. ఒకప్పుడు రవితేజ సినిమా అంటే కనీసం ఓపెనింగ్స్ వచ్చేవి. ఆయన సినిమా ఎలా ఉన్నా కూడా కొంతవరకు వసూలు చేసేది. కానీ గత రెండేళ్లుగా రవితేజ సినిమాలకు అసలు కలెక్షన్లు రావడం లేదు. అంటే కనీసం పది కోట్ల మార్క్ కూడా అందుకోలేక దారుణంగా పడిపోయింది రవితేజ మార్కెట్. గత వారం విడుదలైన డిస్కో రాజా సినిమా తొలి వారంలో కేవలం ఏడు కోట్ల 50 లక్షల మాత్రమే వసూలు చేసింది. ఈ వారం రోజుల్లోనే ఈ సినిమా ఫైనల్ రన్ పూర్తయిపోయింది. దీన్నిబట్టి రవితేజ మార్కెట్ ఎలా చనిపోయిందో అర్థం చేసుకోవచ్చు.

 ప్రస్తుతం ఈయన గోపిచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా విజయం సాధిస్తే తప్ప రవితేజ కెరీర్ కు మంచి రోజులు రావు. ఒక రకంగా చెప్పాలంటే గోపీచంద్ సినిమా రవితేజ కు డు ఆర్ డై లాంటిది. కచ్చితంగా విజయం సాధించాల్సిందే. లేదంటే మాత్రం ఈయనను మర్చిపోవలసిందే. ఇంత కఠినంగా ఎందుకు చెబుతున్నాను అనేది కూడా రవితేజ అభిమానులకు అర్థమైపోయి ఉంటుంది. ఒకప్పుడు ఏడాదికి మూడు సినిమాలు చేసి అందులో కచ్చితంగా ఒక సినిమా బ్లాక్ బస్టర్ కొట్టేవాడు మాస్ రాజా. 

కానీ ఇప్పుడు ఏడాదికి రెండు సినిమాలు చేస్తే ఆ రెండు రిజిస్టర్ అవుతున్నాయి. డిస్కో రాజా పరిస్థితి కూడా అంతే క్రాక్ సినిమాతో హిట్ కొట్టి ఖచ్చితంగా మళ్లీ తన స్టామినా నిరూపించుకుంటానని ధీమాగా చెబుతున్నాడు మాస్ రాజా. మరి ఆయన నమ్మకాన్ని క్రాక్ సినిమా ఎంతవరకు నిలబెడుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాతో పాటు రమేష్ వర్మ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు రవితేజ. 

More Related Stories