ఆ హీరో కూడా శ్రీనువైట్లకు హ్యాండిచ్చేలా ఉన్నాడుగా..

అమర్ అక్బర్ ఆంటోనీ తర్వాత ఇండస్ట్రీలో శ్రీనువైట్ల చాలా మంది హీరోల దగ్గరికి వెళ్తున్నాడు వస్తున్నాడు కానీ వర్కవుట్ మాత్రం కావడం లేదు. ఒకటి రెండు అంటే ఏమో అనుకోవచ్చు కానీ మెహర్ రమేష్ కు పోటీగా వరసగా నాలుగు డిజాస్టర్లు ఇచ్చాడు శ్రీనువైట్ల. ఒకప్పుడు మెహర్ ను చూస్తే నిర్మాతలు పారిపోయేవాళ్లు. ఇప్పుడు పాపం శీనువైట్లకు కూడా అలాంటి పరిస్థితే వచ్చింది.
ఈయన గత సినిమా అమర్ అక్బర్ ఆంటోనీ చూసిన తర్వాత శీనువైట్ల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే సగటు సినీ అభిమాని అడిగే ప్రశ్న ఇలాగే ఉంటుంది. హా ఇంకేంటి ఆయన్ని మరిచిపోవచ్చు కదా.. ఇప్పుడు ఆయనకు ఛాన్స్ ఇచ్చే ధైర్యం ఏ హీరో అయినా చేస్తాడంటారా అని వైట్ల గురించి డిస్కషన్స్ నడుస్తున్నాయిప్పుడు. ఎందుకంటే అమర్ అక్బర్ ఆంటోనీ ఆయన తీసిన విధానం అలా ఉంది మరి. అయినా ఒకప్పుడు ఎలా ఉండేవాడు.. ఇప్పుడు ఎలా అయిపోయాడు.. ఇప్పుడు శీనువైట్లను చూసి ఇండస్ట్రీలో చాలా మంది అనుకుంటున్న మాట ఇది.
వరసగా మూడు డిజాస్టర్లు ఇచ్చేసరికి శీనువైట్లను నమ్మే పరిస్థితుల్లో ఏ హీరో లేడిప్పుడు. పైగా ఆగడు.. బ్రూస్ లీ.. మిస్టర్ మూడు భారీ నష్టాలనే తీసుకొచ్చాయి. అలాంటి టైమ్ లో భారీ బడ్జెట్ ఇచ్చి.. రవితేజ లాంటి హీరోను ఇచ్చి.. ఆరేళ్ల తర్వాత ఇలియానాను తెలుగు ఇండస్ట్రీకి పట్టుకొచ్చి.. మొత్తం అందరు కమెడియన్స్ ను చేతుల్లో పెడితే మరో డిజాస్టర్ సినిమాను గిఫ్టుగా ఇచ్చాడు శీనువైట్ల. ఈ చిత్రం కనీసం 5 కోట్లు తీసుకురాలేకపోయింది. దాంతో ఈ సినిమా చూసిన తర్వాత వైట్ల గారి బుర్రపైనే డౌట్లు వస్తున్నాయి. ఇలాంటి టైమ్ లో ఎవర్ని నమ్మాలో కూడా తెలియని పరిస్థితికి వెళ్లిపోయాడు శీనువైట్ల.
ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఇప్పుడు మరో కామెడీ ఎంటర్టైనర్ సిద్ధం చేసుకుంటున్నాడని.. ఈ సినిమాను మంచు విష్ణుతో ప్లాన్ చేయాలని చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు పెద్దగా సినిమాలు చేయడం లేదు విష్ణు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ఢీ సినిమా సంచలన విజయం సాధించింది. అదే నమ్మకంతో ఇప్పుడు విష్ణు కోసం మరో కామెడీ ఎంటర్టైనర్ శీను వైట్ల సిద్ధం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అన్నీ కుదిరితే త్వరలోనే ఈ కాంబినేషన్ లో ఒక సినిమా మొదలు కానుందని ఇండస్ట్రీలో గుసగుసలు బాగానే వినబడుతున్నాయి. కానీ విష్ణు మాత్రం పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.