English   

రోజుకు రెండు సినిమాలు చేస్తున్న పవన్ కళ్యాణ్..

Pawan Kalyan
2020-02-04 09:52:38

20 రోజుల్లో ఎంత మార్పు.. కేవలం 20 రోజుల్లోనే ఎంత మార్పు.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని చూసి అభిమానులు ఇదే అనుకుంటున్నారు. సరిగ్గా నెల రోజుల కింద ఈయన అసలు సినిమాలు చేస్తాడా చేయడా అనే అనుమానాలు ఉండేవి. కానీ ఇప్పుడు ఒకే రోజు రెండు సినిమాలు చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఇది కాస్త విచిత్రంగానే అనిపిస్తుంది. ప్రస్తుతం ఆయన దగ్గర అంత సమయం లేదు. అందుకే ఒప్పుకున్న సినిమాలు వీలైనంత త్వరగా పూర్తిచేసే పనిలో పడ్డాడు పవర్ స్టార్. 

ఇప్పటికే పింక్ సినిమా రీమేక్ మొదలైపోయి 15 రోజులు దాటింది. పగలు రాజకీయాలు రాత్రి సినిమా షూటింగ్ చేసుకుంటూ బిజీగా ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఇదిలా ఉండగానే ఫిబ్రవరి 3 నుంచి క్రిష్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్లో కూడా అడుగుపెట్టాడు పవన్. ఈ చిత్రం షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో మొదలైంది. అక్కడే భారీ షెడ్యూల్ ప్లాన్ చేశాడు దర్శకుడు క్రిష్. ఎన్టీఆర్ బయోపిక్ డిజాస్టర్ తర్వాత ఏడాది గ్యాప్ తీసుకుని క్రిష్ చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా 25 కోట్లతో భారీ సెట్ల నిర్మాణం కూడా జరుగుతుంది. 

చార్మినార్ తో పాటు తాజ్ మహల్ సెట్ కూడా వేస్తున్నారు. ఏఏం రత్నం దాదాపు 100 కోట్లతో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇంతకు ముందు మాట ఇచ్చినట్లుగానే ఆయనతో సినిమా చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది. మొత్తానికి ఒకే రోజు 2 సినిమా షూటింగ్స్ లో పవన్ కళ్యాణ్ పాల్గొంటున్నాడు. ఉదయం క్రిష్.. సాయంత్రం పింక్ రీమేక్.. ఇలా షూటింగులు చేస్తూనే మధ్యలో మళ్లీ రాజకీయాలకు కూడా సమయం కేటాయిస్తున్నారు పవర్ స్టార్. ఈయన కష్టం చూసి అభిమానులు కూడా అయ్యో పాపం అంటున్నారు. 

More Related Stories