English   

విజయ్ సేతుపతి కళ్ళన్నీ టాలీవుడ్ పైనే..

Vijay Sethupathi
2020-02-04 10:01:56

తమిళనాట స్టార్ హీరోగా చక్రం తిప్పుతూ కూడా ఇప్పుడు తెలుగులోనూ ఇమేజ్ కోసం పాకులాడుతున్నాడు విజయ్ సేతుపతి. కేవలం హీరోగానే నటిస్తాను అనే మాట లేకుండా వరసగా అన్ని రకాల పాత్రలు చేస్తున్నాడు ఈయన. కథ నచ్చాలే కానీ చిన్నా పెద్దా చూసుకోకుండా విలన్ అయిపోతున్నాడు కూడా. ఇక ఇప్పుడు ఈయన ఫోకస్ అంతా తెలుగు సినిమాపైనే ఉంది. 

సైరాలో ఇప్పటికే చిన్న పాత్రతో ఇక్కడి ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు విజయ్. మెగా చిన్న మేనల్లుడు వైష్ణవ తేజ్ హీరోగా వస్తున్న సినిమాలో కూడా ఈయన నటిస్తున్నాడు. సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్ లాంటి నిర్మాణ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటంతో అంచనాలు పెరిగిపోతున్నాయి. బుచ్చిబాబు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే దాదాపు 50 శాతం పూర్తయింది. 2020లోనే సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు. ఈ సినిమాలో విలన్ గా తమిళ సూపర్ స్టార్ విజయ్ సేతుపతి నటిస్తున్నాడు. 

వరుసగా విభిన్నమైన చిత్రాలతో తనకంటూ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ్.. తెలుగు ఇండస్ట్రీపై ఇప్పుడు దృష్టి పెట్టాడు. క్యారెక్టర్ నచ్చితే హీరో ఎవరో అని కూడా చూడడు. తన పాత్రకు మంచి పేరు వస్తుంది అంటే చిన్న సినిమాలలో కూడా నటిస్తాడు విజయ్ సేతుపతి. ఇప్పుడు కూడా వైష్ణవ్ తేజ్ సినిమాలో క్యారెక్టర్ అద్భుతంగా ఉండటంతో విజయ్ ఒప్పుకున్నాడు. దాంతోపాటు బన్నీ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న సినిమాలో కూడా ప్రతినాయకుడిగా నటిస్తున్నాడని తెలుస్తోంది. మొత్తానికి తెలుగుపై పూర్తిస్థాయిలో విరుచుకుపడుతున్నాడు ఈయన.  

More Related Stories