English   

విజయ్ పేరు వింటే భయపడుతున్న రజినీకాంత్ ఫ్యాన్స్..

Rajinikanth
2020-02-04 10:43:49

తమిళనాట రజినీకాంత్ హవా తగ్గిపోతుంది. మెల్లగా విజయ్ తన స్టామినా పెంచుకుంటున్నాడు. ఇది కొన్నేళ్లుగా కనిపిస్తూనే ఉంది. వరస విజయాలతో బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు రేపుతున్నాడు ఈయన. ఇక ఇప్పుడు ఇళయ దళపతి మరో సంచలనానికి తెర తీస్తున్నాడు. గతేడాది 'బిగిల్' సినిమాతో 300కోట్ల క్లబ్లో జాయిన్ అయ్యాడు ఈయన. దీపావళికి వచ్చిన ఈ సినిమా యావరేజ్ టాక్ తోనే 300 కోట్లు వసూలు చేసింది. విడుదల కానుంది. ఈ సినిమా కోసం భారీ రెమ్యునరేషన్ అందుకున్నాడు విజయ్. 

ఇప్పటి వరకు సౌత్ హీరోలు కలలు కంటున్న ఫిగర్ అది. ఈ చిత్రానికి ఏకంగా 40 కోట్ల పారితోషికం అందుకున్నాడు విజయ్. ఇక ఇప్పుడు మరో సంచలనానికి తెర తీస్తున్నాడు. ఓకే సినిమా కోసం ఏకంగా 100 కోట్లు అందుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈయన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర చేస్తున్న మ్యాజిక్ కూడా అలాగే ఉన్నాయి. 300 కోట్లను కూడా ఈజీగా క్రాస్ చేస్తున్నాయి. రెండేళ్ల కింద సర్కార్ కూడా యావరేజ్ టాక్ తెచ్చుకుని సంచలన విజయం సాధించింది. తమిళనాటే కాదు తెలుగులో కూడా ఈయన సినిమాల్లో ఇప్పుడు విజయం సాధిస్తున్నాయి.

 ప్రస్తుతం లోకేష్ కనకరాజు దర్శకత్వంలో మాస్టర్ సినిమా చేస్తున్నాడు విజయ్. ఈ సినిమాపై తెలుగులో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. సమ్మర్ లో ఈ సినిమా విడుదల కానుంది. దీని కోసం ఏకంగా 100 కోట్లు పారితోషికం అనుకుంటున్నాడని తమిళనాట వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అదే నిజమైతే రజినీకాంత్ కూడా విజయ్ తర్వాతే. అన్నింటికీ మించి ఇండియాలో ఇంత పారితోషికం అందుకుంటున్న హీరో మరొకరు లేరు. మొత్తానికి అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ ఔరా అనిపిస్తున్నాడు దళపతి విజయ్. 

More Related Stories