English   

మళ్ళీ లీకయిన పవన్ సినిమా వీడియో...డైలాగ్ అదుర్స్ 

Pawan Kalyan
2020-02-04 12:23:21

స్టార్ హీరోల సినిమాలకు లీకుల బాధ తప్పడం లేదు. ఒకప్పుడు ఫోన్స్ పెద్దగా ఉండేవి కాదు కదా, అప్పట్లో పెద్దగా ఉండేవి కాదు. ఇప్పుడు ఫోన్‌ల వాడకం పెరిగిన తరవాత స్టార్ హీరోల సినిమాలో ఏదో ఒక సీన్ లీక్ అవుతూనే వుంది. ఇది అత్తారింటికి మొదలు మొన్నటి ఆర్ఆర్ఆర్‌ దాకా ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో లీక్ కావడంతో మేకర్స్ కి టెన్షన్ పట్టుకున్తూనే ఉంది. 

ఇప్పుడు ఈ లీకుల టెన్షన్ పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ తాజా సినిమా పింక్ టీంని కూడా వెంటాడుతోంది. ఈ సినిమా షూటింగ్‌ కు సంబంధించిన వీడియో ఒకటి లీకైంది. ఓ వ్యక్తితో ఫైట్ చేస్తూ.. ‘నేను నల్లకోటు వేసుకుంటే వేసుకోవటానికి పిటీషన్లు, తీసుకోవటానికి బెయిళ్లు ఉండవు’’ అని పవన్ కళ్యాణ్ డైలాగ్ చెబుతూన్న ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అయిన ‘పింక్’ సినిమాకు ఈ సినిమా రీమేక్‌.సెట్ లో ఉన్న వ్యక్తులే రహస్యంగా రికార్డు చేసి లీక్ చేసేస్తున్నట్లు భావిస్తున్నారు. 

గతంలోనూ పవన్ కళ్యాణ్ నల్ల దుస్తుల్లో నడుచుకుంటూ వెళ్తున్న ఫొటోలు లీక్ అయ్యాయి. దాంతో సెక్యూరిటీ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడంలేదని పవన్ నిర్మాతలు దిల్ రాజు, బోనీ కపూర్లపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ప్రచారం జరిగింది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తిచేసి మే 15న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.  

More Related Stories