English   

నిర్మాతగా చరణ్ తెలివి...భలే వాడేస్తున్నాడు 

Ram Charan
2020-02-04 12:42:38

భరత్ అనే నేను సినిమా తర్వాత చాల గ్యాప్ తీసుకున్నాడు దర్శకుడు కొరటాల. నిజానికి ఆయనకి అపజయం అనేదే తెలీదు, తీసిన ప్రతి సినిమాతో తన మార్కెట్ మరింత పెంచుకుంటూ పోతున్నాడు ఆయన. అయితే ఆయన ఇంత కాలం ఆగడానికి కారణం ఒకటే అది చిరంజీవి. అవును మెగాస్టార్ తో ఆయన సినిమా చేయడం కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. 

అయితే ఈ సినిమా కోసం పెద్ద ఎత్తున సెట్స్ వేయాల్సిన పరిస్థితి ఏర్పడిందట. దీంతో నిర్మాతగా వ్యవహరిస్తున్న చరణ్ హైదరాబాద్ ఔట్ స్కర్ట్స్ లోని కోకాపేట పరిసరాల్లో సైరా కోసం వేసిన సెట్స్ ని అలాగే రంగస్థలం కోసం ఇంతకు ముందు మైత్రీ వాళ్ళు వేసిన విలేజ్ సెట్ ని చిరు 151 కోసం ఉపయోగిస్తున్నారని చెబుతున్నారు. ఈ సినిమా కోసం సెట్స్ ని రీకన్ స్ట్రక్ట్ చేసుకుని వాటినే మళ్ళీ వాడుతున్నారని అంటున్నారు. కధ ప్రకారం ఈ సెట్స్ లో దాదాపు 60 రోజుల పాటు ఒక లాంగ్ షెడ్యూల్ ని కొరటాల ప్లాన్ చేశారని విస్వనీయవర్గాల సమాచారం. 

ఈ షెడ్యూల్ లో టాకీ మాత్రమే కాక ఫైట్స్ సహా కొన్ని పాటల్ని కూడా ముగించేయనున్నారని అంటున్నారు. ఇప్పటికే ఈ కధ గురించి రకరకాల ప్రచారం సాగింది. దేవాలయ భూముల స్కామ్ నేపథ్యంలో ఈ కధ ఉందని ప్రచారం అయితే జరిగింది. ఇందులో నిజం ఎంత ఉందో కానీ ఈ సినిమా వీలయినత త్వరగా పూర్తి చేసేసి 2020 దసరాకి రిలీజ్ చేయచ్చని అంటున్నారు. 

More Related Stories