English   

అన్నాతమ్ముళ్ళతో రష్మిక రచ్చ 

 Rashmika Mandanna
2020-02-04 14:09:49

కన్నడ కస్తూరి రష్మిక మందన్న గీత గోవిందం సినిమాతో తెలుగువారికి చాలా దగ్గరైంది. ఛలో సినిమాతో తెలుగు సినిమాకి ఎంట్రీ ఇచ్చిన ఆ భామ గీత గోవిందంతో సెటిలయిపోయింది. మొన్న మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన సరిలేరు నీకెవ్వరు నటించి సూపర్ హిట్ అందుకుంది. 

ఆమె ఇప్పుడు నితిన్‌తో భీష్మలో నటిస్తోంది. ఈ సినిమా విడుదలకు రెడీ అయ్యింది. అదే జోరుతో ఆమె అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వస్తున్న శేషాచలం సినిమాలోనూ ఆమె ఛాన్స్ అందుకుంది. తెలుగులో ఇద్దరు స్టార్స్‌తో సినిమాలు సెట్ చేసుకున్న ఈ భామ త‌మిళంలోనూ తన నట ప్రస్థానం మొద‌లుపెట్టేసింది. 

ఇప్ప‌టికే కార్తితో సుల్తాన్ అనే ఓ సినిమా చేస్తోంది. ఆమె ఈ సినిమాతో పాటు సూర్య‌తో మరో సినిమాని ఒప్పుకున్నట్టు చెబుతున్నారు. ద‌ర్శ‌కుడు హ‌రి ద‌ర్శ‌క‌త్వంలో సూర్య ఓ సినిమా ఒప్పుకున్నాడని ఇందులో సూర్య‌కు జోడీగా ముందు మాళ‌వికా మోహ‌న‌న్‌ని అనుకున్నారు. అయితే ఆమె విజ‌య్ `మాస్ట‌ర్‌` సినిమాతో బిజీగా వుండ‌టం వ‌ల్ల ఆ స్థానంలో ర‌ష్మికని తీసుకోవాల‌ని అనుకున్నారని ప్రచారం జరుగుతోంది. అందుకే ఆమె ఒకే సారి అన్నా త‌మ్ముళ్ల‌తో నటిస్తోందని అంటున్నారు.  

More Related Stories