English   

మరో సారి సాయి పల్లవితో నాని

nani
2020-02-05 05:14:38

నేచురల్ స్టార్ నాని గత ఏడాది రెండు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టాడు. ఇప్పుడు తనకి లైఫ్ ఇచ్చిన డైరక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని నెగటివ్ రోల్ లో నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ “V” మూవీ మార్చి 25వ తేదీ రిలీజ్ కి రెడీ అయింది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి అయిన వెంటనే నాని ఇంతకు ముందు ఒప్పుకున్నట్టు శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందనున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “టక్ జగదీష్” మూవీ షూటింగ్ లో జాయిన్ అవుతారు. “టక్ జగదీష్” మూవీ షూటింగ్ త్వరగా కంప్లీట్ చేయాలని చూస్తున్నారు ఎందుకంటే “టక్ జగదీష్” మూవీ తరువాత నాని మరొ సినిమాని పట్టాలెక్కించనున్నారు. హారిక హాసినీ వారి సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై “టాక్సీవాలా “ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ మూవీ రూపొందనుంది. ఈ మూవీ లో ఇద్దరు కథానాయికలలో ఒకరిగా సాయి పల్లవిని ఎంపిక చేయాలని యూనిట్ ప్లాన్ చేసినట్టు చెబుతున్నారు. నాని, సాయి పల్లవి జంటగా “MCA” సినిమాలో నటించారు. సాయి పల్లవి ప్రస్తుతం నాగచైతన్య తో “లవ్ స్టోరీ”, రానా తో “విరాటపర్వం ”లో నటిస్తోంది. మరో సారి వీరి జంట ఏమి మ్యాజిక్ చేయనుందో వేచి చూడాలి మరి.

 

More Related Stories