హమ్మయ్య అదే నిజం...అఖిల్ టైటిల్ అదే...

అఖిల్ అక్కినేని హీరోగా మెగా ప్రొడ్యూసర్ అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ మీద తెరకెక్కుతున్న ప్రోడక్షన్ నెం 5 కి టైటిల్ కన్ఫర్మ్ అయ్యింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం లో నిర్మాతలు బన్నీవాసు , వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి ముందు నుండీ ప్రచారం జరుగుతున్నట్టే "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" అనే టైటిల్ ఖరారు చేసినట్టు సినిమా యూనిట్ ఈరోజు ఒక ప్రకటన విడుదల చేసింది. అఖిల్ సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా మీద చాలా ఆశలు అంచనాలు పెట్టేసుకున్నాడు అఖిల్. గోపి సుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను అఖిల్ పుట్టినరోజు కానుకగా ఏప్రిల్ 8న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని చూస్తున్నారు మేకర్స్. త్వరలోనే ఈ విషయం మీద క్లారిటీ వచ్చే అవకాశముంది.
ఈ సినిమా తర్వాత తమిళ్ డైరెక్టర్ మిత్రన్ తో కలిసి అఖిల్ ఓ సినిమా చేయనున్నట్టు అక్కినేని కాంపౌండ్ వర్గాల సమాచారం. ప్రస్తుతం శివ కార్తికేయన్‌తో ‘హీరో’ అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు మిత్రన్. ఈ ఇద్దరూ తమ తమ సినిమాలు పూర్తి అయిన తర్వాత వీరిద్దరి ఆ కొత్త సినిమా మొదలు పెడతారని చెబుతున్నారు. అయితే ఈ విషయం మీద అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మరి అఖిల్ ఎన్నో ఆశలు పెట్టుకుని చేస్తున్న ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ అందుకుంటాడో..? లేదో..? చూడాలి.