English   

లాయర్ మేమ్ గా నయన్ 

Nayanthara
2020-02-05 09:01:29

ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి హాట్ టాపిక్ ఏదైనా ఉందా అంటే అది పవన్ కళ్యాణ్ సినిమాలు అనే చెప్పాలి. అది కూడా ఆయన లాయర్ గా పింక్ రీమేక్ లో నటించనుండడంతో మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇప్పుడు ఆయన బాటలోనే లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయనతార కూడా లాయర్ పాత్రలో దర్శనమివ్వబోతుందని గట్టిగా ప్రచారం జరుగుతోంది. 

రజనీకాంత్‌ హీరోగా విశ్వాసం దర్శకుడు శివ ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. మీనా, ఖుష్బూ, కీర్తి సురేష్‌ లు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో నయనతార కూడా నటించనున్నట్లు తెలుస్తోంది. కథలో కీలకమైన పాత్ర కావడంతో పాటు సినిమాకి మరింత క్రేజ్ తెస్తుందని భావించి యూనిట్ నయన్‌ను సంప్రదించిందని సమచారం. ఆమె కూడా ఆ పాత్రలో నటించేందుకు రెడీ అయిందని చెబుతున్నారు. 

దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి. ఇప్పటికే రజనీ-నయన్‌ కాంబినేషన్‌లో ‘చంద్రముఖి’, ‘కథానాయకుడు’, ‘దర్బార్‌’ సినిమాలు వచ్చి చిత్రాలొచ్చాయి. మంచి హిట్ గా నిలిచాయి. దీంతో నయన్‌ మరోసారి రజనీతో నటిస్తుందనగానే సినిమా మీద ఆసక్తి నెలకొంది.

More Related Stories