పవన్ చిన్న కొడుకు వీడియో...చూశారా

పవన్ కళ్యాణ్ సినిమాలే కాదు తన జీవన శైలి, రాజకీయ ప్రస్థానం అంతా విభిన్నం, ప్రతి విషయంలో అందరినీ ఆశ్చర్యపరుస్తూ వెళ్లడం పవన్ కి వెన్నతోపెట్టిన విద్య. పవన్ తన రెండో కొడుక్కి పెట్టిన పేరు అప్పట్లో చర్చనీయాంశమయింది. మార్క్ శంకర్ పవనోవిచ్.. ఈ పేరు వినగానే ఎవరో పవన్ కళ్యాణ్ వీర ఫ్యాన్ తన కొడుక్కి పెట్టుకున్నట్లు ఉంటుంది. కాని ఇది పవన్ ఫ్యాన్స్ది కాదు ఏకంగా పవన్ కళ్యాణ్ తన కొడుక్కు పెట్టుకున్న పేరు.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొడుకు వీడియో అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో హల్ చల్ చేసి సంచలనం సృష్టిస్తుంది. ఈ వీడియో జూనియర్ పవన్ కళ్యాణ్ అంటూ పవన్ అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. వీడియోలో తెలుపు రంగు దుస్తులు ధరించిన బుడ్డోడు చొక్కా మీద జనసేన పార్టీ లేబుల్ ధరించి ఉన్నాడు. అయితే ఇది పవన్ కొడుకే అని కొందరు అంటుంటే లేదు అని మరి కొందరు అంటున్నారు. ఇందులో నిజం ఎంతుందో మరి.