English   

సుడిగాలి సుదీర్ అలాంటి సినిమా చేస్తా.. రష్మి గౌతమ్ క్లారిటీ..

Anchor Rashmi
2020-02-05 14:20:52

సాధారణంగా సినిమాల్లో కొందరు క్రేజీ కపుల్స్ ఉంటారు. వాళ్ళు కలిసి నటిస్తే అంచనాలు ఆటోమేటిక్ గా పెరిగిపోతాయి. అలాంటి కపుల్స్ బుల్లితెరపై కూడా ఉంటారు. అలాంటి వాళ్లలో ముందు చెప్పుకోవాల్సింది సుడిగాలి సుధీర్, రష్మి గౌతమ్ గురించే. వీళ్లిద్దరి మధ్య ఏమీ ఉండదు.. కానీ ఏదో ఉన్నట్లు ఎప్పుడు వార్తలు వస్తూనే ఉంటాయి. పెళ్లి కూడా చేసుకుంటారు అంటూ సోషల్ మీడియాలో రిలేషన్ గురించి ఎప్పటికప్పుడు కొత్త వార్తలు పుట్టుకొస్తుంటాయి. 

ఇక అసలు విషయానికొస్తే సుడిగాలి సుధీర్ ఇప్పుడు సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. ఈ మధ్య ఆయన నటించిన సాఫ్ట్వేర్ సుదీర్ సినిమా విడుదలైంది. అయితే అది ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమాలో ముందుగా హీరోయిన్ గా రష్మిని అనుకున్నారు కానీ అనుకోని కారణాలతో డేట్స్ అడ్జస్ట్ కాక రష్మీ తప్పుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం సుధీర్ అండ్ టీమ్ కలిసి 3 మంకీస్ అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఫిబ్రవరి 7న ఈ సినిమా విడుదల కానుంది. ఇందులో సుడిగాలి సుధీర్ తో పాటు గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్ కూడా నటిస్తున్నారు. ముగ్గురూ కలిసి నటించడంతో మంచి ఆసక్తి ఉంది. 

ఇక ఈ సినిమా ప్రమోషన్ లో యాంకర్ రష్మీ గౌతమ్ కూడా పాల్గొంటుంది. సుధీర్, శ్రీను, రామ్ ప్రసాద్ ముగ్గురూ త్రీ మంకీస్ సినిమాలో అద్భుతంగా చేశారని చెబుతోంది. ఇక సుధీర్‌తో తన బంధం గురించి చెబుతూ అతను తనకు మంచి స్నేహితుడని తేల్చేసింది. సుధీర్‌కు తనకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వుందని.. దాంతో  తమ ఇద్దరి కాంబినేషన్లో సినిమా రావాలంటే కచ్చితంగా మంచి కథ ఉండాల్సిందే అంటుంది రష్మి గౌతమ్. అందరి అంచనాలను అందుకునే కథ వస్తే కచ్చితంగా సుడిగాలి సుధీర్ తో కలిసి సినిమా చేస్తానని చెబుతోంది రష్మీ. 

ఇప్పుడు కాకపోయిన తర్వాతైనా కచ్చితంగా తామిద్దరం కలిసి నటిస్తాం అని క్లారిటీ ఇచ్చింది. అలాంటి స్క్రిప్ట్ కోసమే వేచి చూస్తున్నట్లు రష్మీ గౌతమ్ తెలిపింది. అలాంటి కథతో వస్తే సినిమా చేయడానికి తమకేమీ అభ్యంతరం లేదు అంటున్నారు ఈ జోడీ. మరి ఆ కథ ఎప్పుడు వస్తుందో చూడాలి.

More Related Stories