English   

ఎద మీద దేవుడి టాటూతో రచ్చ చేస్తున్న పూనమ్ కౌర్

kaur
2020-02-05 20:05:39

పూనం కౌర్...తెలుగులో కొన్ని సినిమాలలో హీరోయిన్ గా నటించినా ఆమె పెద్దగా పాపులర్ అవ్వలేదు. కాని ప్రస్తుతం సినిమాలు ఏమీ లేకుండా ఖాళీగా ఉన్న సమయంలో ఆమె హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. సినిమాలలో నటిస్తున్నా, నటించకపోయినా ఆమె మీద పెద్దగా మీడియా కూడా ఫోకస్ చేసేది కాదు. అయితే ఎప్పుడయితే పవన్ కళ్యాణ్ తో పూనం కౌర్ ని కలిపి కత్తి మహేష్ ఆరోపణలు చేశాడో అప్పటి నుండి పూనం కౌర్ మీద ఒక్కసారిగా మీడియా ఆసక్తి పెరిగింది. అయితే అనూహ్యంగా రెండేళ్ల క్రితం కృష్ణాష్టమి రోజున పవన్ కల్యాణ్ పుట్టినరోజు వచ్చింది. ఆరోజున పూనమ్ 'నా కృష్ణుడి జన్మదినం సందర్భంగా నేను చాలా ప్రేమతో ఓ వీడియోను రెడీ చేశాను. నా హృదయాంతరాల్లోంచి పుట్టిన వీడియో ఇది. దీనిని త్వరలోనే విడుదల చేస్తా' అని పోస్ట్ చేసింది. అంతేకాదు, దీనికి 'పీకే లవ్' అనే ట్యాగ్ కూడా జోడించింది. అప్పట్లో ఇది హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఆమె ఆ తర్వాత ఈ విషయంలో సైలెంట్ అయిపొయింది. అయితే తన ఎద మీద టాటూను వేయించుకుంది. శివుడి ఆయుధమైన త్రిశూలం, ఆయన మెడలోని పామును తన 'ఎదపై' పచ్చబొట్టుగా పొడిపించుకున్న ఈ భామ తన ఫేస్‌బుక్ ఖాతాలో సదరు ఫొటోను షేర్ చేసింది. ఈ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కర్తార్ పూర్ కారిడార్ ఓపెన్ చేసినప్పుడు పూనమ్ పాకిస్థాన్ దేశంలోని పంజాబ్ రాష్ట్రంలో ఉన్న కటాస్ రాజ్ అనే ఓ పురాతన ఆలయంలో శివ పూజ చేసింది. కటాస్ రాజ్ ఆలయాన్ని అక్కడి హిందువులు చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ ఆలయం కల్లార్ కహార్ పట్టణానికి సమీపంలో ఉంటుంది. దానికి సంబందించిన టాటూనే ఇది అని అంటున్నారు.

 

More Related Stories