English   

పవన్ సినిమా రీమేక్...ఆ వెబ్సైట్ కి చురకలు అంటించిన హరీష్

harish
2020-02-05 20:19:52

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయాలలో బిజీగా ఉన్నాడు. అయితే పార్టీ నడపాలి అందుకు సినిమాలు చేస్తా అని క్లారిటీ ఇచ్చి మరీ సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే పవన్ పింక్ రీమేక్, క్రిష్ తో మరో సినిమా చేస్తున్నారు. ఇక తాజాగా హరీష్ శంకర్‌తో కూడా సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. మొదటి రెండు సినిమాలు పూర్తి కాగానే ఈ సినిమా కూడా పట్టాలు ఎక్కనుంది. అయితే సినిమా పనులు కూడా మొదలు కాకమునుపే సినిమా కధ ఒక రీమేక్ అని ప్రచారం బయటకొచ్చింది. హరీష్ కి శంకర్ కి రీమేక్స్ స్పెషలిస్ట్ అని పేరుంది. అదీ కాక హరీష్ పవన్ తో తీసిన గబ్బర్ సింగ్ కూడా రీమేక్ కావడంతో ఇప్పుడు పవన్‌తో చేసే సినిమా కూడా ఓ రీమేక్ అని ఒక వెబ్సైట్ కధనాన్ని వండి వార్చింది. కానీ ఆ వార్తలపై హరీష్ క్లారీటీ ఇచ్చారు. అసలు అలాంటి రీమేక్ స్టోరీ కోసం ఏం చూడటం లేదని తేల్చేసిన ఆయన ఆ వెబ్ సైట్ వారికి చురకలు కూడా అంటించారు. మీ రిపోర్టర్స్ అందరూ తనకు తెలిసినవారేనన్న హరీష్, వారికి తనతో ఫోన్ మాట్లాడే చనువు ఉందని తనపై ఏదైనా కథనం రాసే ముందు తనని సంప్రదించవచ్చు అని సూచన చేశారు.

 

More Related Stories