English   

జాను విషయంలో సమంతకు దొరికిపోయిన నాగ చైతన్య..

sam
2020-02-06 05:04:42

తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం మోస్ట్ క్రేజియస్ట్ కపుల్ సమంత, నాగ చైతన్య. పెళ్లి తర్వాత ఇద్దరూ కలిసి నటించే సినిమాలకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా అంతకుముందు చైతు సమంత కలిసి నటించిన సినిమాలకు క్రేజ్ ఉండేది.. కానీ ఇప్పుడు మాత్రం దానికి రెండింతలు పెరిగిపోయింది. దానికి నిదర్శనమే మజిలీ సినిమా. శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ సినిమా 40 కోట్ల షేర్ వసూలు చేసి చైతు కెరీర్లో అతి పెద్ద విజయంగా నిలిచింది. ఇదిలా ఉంటే ఇప్పుడు జాను సినిమా కారణంగా సమంత నాగచైతన్య మధ్య చిన్నపాటి గొడవ జరిగిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని అనుకున్నప్పుడు సమంతకు జంటగా నాగచైతన్యను అనుకున్నాడు నిర్మాత దిల్ రాజు. ఇద్దరూ కలిసి నటిస్తే ఖచ్చితంగా సినిమా రేంజ్ పెరుగుతుందని భావించాడు ఈ నిర్మాత. అందుకే ముందుగా ప్రపోజల్ చైతు ముందు పెట్టాడు. కానీ ఎందుకో తెలియదు మరి జాను సినిమా వైపు నాగచైతన్య పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఆ సమయంలో వెంకీ మామతో పాటు శేఖర్ కమ్ముల సినిమాకు కూడా కమిట్ అయ్యాడు నాగ చైతన్య.

అందుకే ఇటువైపు రాలేదు. దాంతో ఆయన ప్లేస్ లోకి వచ్చాడు శర్వానంద్. ఇప్పుడు సినిమా చూసిన తర్వాత చైతూపై తెలియకుండానే సమంతాకు కోపం వచ్చిందని తెలుస్తోంది. ఇంత మంచి సినిమాను అనవసరంగా వదులుకున్నావ్ అంటూ ఆయనతో చిన్న సైజు తగువు పెట్టుకుందని ప్రచారం జరుగుతుంది. అనవసరంగా ఒక మంచి సినిమా వదులుకున్నావు ఇద్దరం కలిసి చేసి ఉంటే ఖచ్చితంగా సినిమా రేంజ్ కూడా పెరిగి ఉండేది కదా అంటూ చైతూతో సమంత వాదించిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై చైతు కూడా సమంతకు సారీ చెప్పేసాడని.. ఇకపై మంచి కథలు వస్తే కచ్చితంగా కలిసి నటిద్దాం అని భార్యకు మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏదేమైనా కూడా జాను సినిమాను చైతు వదులుకోవడం సమంతకు ససేమిరా నచ్చలేదని ఇండస్ట్రీలో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. మరి రేపు సినిమా విడుదలైన తర్వాత ఒకవేళ సూపర్ హిట్ అయితే వదిలేసుకున్న బాధ చేతులో కనిపిస్తుందో లేదో.

More Related Stories