English   

స్టార్ హీరో విజయ్ మీద ఐటీ దాడి...షూటింగ్ ఆపి మరీ గంటల పాటు విచారణ..

Actor Vijay.jpg
2020-02-06 07:39:12

తమిళ స్టార్ హీరో విజయ్ కు ఐటీ శాఖ షాక్ ఇచ్చింది. విజయ్ నివాసం, ఆయన సంస్థల మీద ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. కొద్దిరోజుల కిందట శాండల్ వుడ్ లో రష్మిక ఇంటిపై దాడులు చేపట్టిన ఐటీ అధికారులు తాజాగా విజయ్‌ని టార్గెట్ చేయడం తమిళ చిత్ర పరిశ్రమలో కలకలం రేపుతోంది. విజయ్ హీరోగా ఆయనకి చెందిన సొంత నిర్మాణ సంస్థ ఏజీఎస్ ఎంటర్ టైన్ మెయింట్ గత ఏడాది ‘బిగిల్’ అనే సినిమా నిర్మించింది. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రానికి సంబంధించిన ఆదాయపు పన్నుల వివరాలను సరిగ్గా చూపకపోవడంతో చెన్నైలోని విజయ్ కు చెందిన సంస్థల్లో ఐటీ అధికారులు ఏకకాలంలో దాడులకు దిగారని చెబుతున్నారు.

ప్రస్తుతం విజయ్ నటిస్తున్న ‘మాస్టర్’ సినిమా షూటింగ్ కడలూరు జిల్లా నెయివేళీ సమీపంలో జరుగుతోంది. విజయ్ కూడా అక్కడే ఉన్నారు. అక్కడికి కూడా వెళ్ళిన ఆరుమంది ఐటిశాఖ అధికారులు షూట్ నిలిపివేసి మరీ విచారించారు. విజయ్ మీదనే కాక ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, ఏజీఎస్ సినిమా, డిస్టిబ్యూషన్,ప్రొడక్షన్‌ లపై కూడా ఐటి దాడులు జరిగాయి. అక్కడితో ఆగక చెన్నైలోని ఇరవై ప్రాంతాలలో ఏకకాలంలో ఐటి సోదాలు జరిగాయి. నిన్న ఉదయం నుండి ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, ఏజీఎస్ సినిమా, డిస్టిబ్యూషన్,ప్రొడక్షన్‌ లపై ఐటి దాడులు జరిగాయి.

More Related Stories