English   

టాలీవుడ్ డైరెక్టర్ అరెస్ట్...అందుకేనా...

Degree College Movie.jpg
2020-02-06 08:27:27

నంది నర్సింహ 1940లో ఒక గ్రామం లాంటి జాతీయ అవార్డ్ విన్నింగ్ మూవీని రూపొందించిన ఈ డైరెక్టర్ డిగ్రీ కాలేజ్ అనే సినిమాను తీశాడు. ఈ మూవీ ఇద్దరు వేర్వేరు కులాలకు చెందిన అమ్మాయి, అబ్బాయి మధ్య జరిగిన ప్రేమ కథగా చెబుతున్నాడు దర్శకుడు. ట్రైలర్ లో తెలంగాణలో చాలా క్యాజువల్ గా వాడే బూతులు ట్రైలర్ లో వినిపించడంతో… ఆటోమేటిక్ గా ఇండస్ట్రీలో బజ్ క్రియేటయింది. అయితే ఇప్పుడు ఈ దర్శకుడిపై నగర వాసులు బుధవారం కేసు నమోదు చేశారు. అమీర్‌పేట మైత్రీవనం కూడలి వద్ద అశ్లీలంగా సినీ పోస్టర్లు పెట్టారంటూ నరసింహ నంది, నిర్మాత శ్రీనివాస్‌ పై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై కేసు నమోదు చేసిన ఎస్ ఆర్ నగర్‌ పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేశారు. హైస్కూల్‌, కమలతో నా ప్రయాణం, లజ్జ వంటి అర్ధ వంతమైన సినిమాలను డైరెక్టర్‌ నర్సింహ నంది తెరకెక్కించారు. అలాగే జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డు కూడా అందుకున్నారు. అయితే అలాంటి ఎన్ని సినిమాలు తీసిన ప్రేక్షకులు ఆదరించడం లేదన్న ఆయన ఇప్పుడు ఇలాంటి సినిమా చేశాడు.

More Related Stories