English   

ప్రియాంక డ్రెస్ మీద ఛాలెంజ్.. పది నిముషాలు వేసుకోవాలట

Hina Khan
2020-02-06 10:58:16

తన అందంతో నటనతో అశేష అభిమానుల్ని సంపాదించుకున్న ప్రియాంక చోప్రా ఇంటర్నెట్‌ లోనూ ట్రేండింగ్ లోనే ఉంటారు. ఆమె ఏం చేసినా హైలెట్‌ అయిపోతుంది. తాజాగా ఆమె వేసుకున్న డ్రెస్సు మీద విపరీతమైన ట్రోల్స్‌ వస్తున్నాయి. దీనిపై పెద్ద రచ్చే జరుగుతోంది. ఇటీవల హాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్రామీ అవార్డుల వేడుకలో.. భర్త నిక్‌జొనాస్‌తో కలిసి సందడి చేసింది ప్రియాంక. ఆ ఫొటోలను వెంటనే సోషల్‌ మీడియాలో షేర్‌చేసింది.

 సోషల్ మీడియాలో ఫొటోలు చూసిన నెటిజన్లు.. ఆమె డ్రెస్సు చండాలంగా ఉందంటూ ట్రోల్‌ చేయడం మొదలెట్టారు. ప్రియాంక డ్రెస్సు చెత్తగా ఉందంటూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెట్టారు. ఈ అంశంపై ప్రియాంక తల్లి మధుచోప్రా కూడా స్పందించారు. తాజాగా, ప్రియాంక డ్రెస్‌పై వస్తున్న ట్రోల్స్‌పై మరో బాలీవుడ్‌ నటి హీనాఖాన్‌ స్పందించారు. ఇతరుల డ్రెస్‌ గురించి కామెంట్‌ చేయడానికి మీరెవరంటూ నెటిజన్లను ప్రశ్నించారు. అంతేకాదు, కామెంట్‌ చేస్తున్నవారికి ఒక ఛాలెంజ్‌ విసిరారు. 

దమ్ముంటే 10 నిమిషాలు ఆ డ్రెస్‌ ధరించాలని ఓపెన్‌ చాలెంజ్‌ చేశారు. ఎందుకంటే.. అంతపెద్ద వేడుకలో ఆ డ్రెస్‌ ధరించడం అంత సులభంకాదన్నారు. అలాంటి డ్రెస్సులు ధరించాలంటే అందంతోపాటు ధైర్యం కావాలని హీనాఖాన్‌ నెటిజన్లకు క్లాస్‌ తీసుకున్నారు.  

More Related Stories