English   

అశ్వద్ధామ ఐదు రోజుల కలెక్షన్స్

Aswathama
2020-02-06 11:23:46

నటుడిగా, నిర్మాతగా నిరూపించుకున్న నాగ శౌర్య అశ్వద్థామ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. ముంబయిలో తన స్నేహితుడి సోదరికి నిజంగా ఎదురైన అనుభవాన్ని కథలా రాసుకున్నానని నాగశౌర్య చెప్పారు. సమాజంలో ఆడవాళ్ల మీద ఎంతటి ఘోరమైన సంఘటనలు జరుగుతున్నాయో ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు. తొలిరోజే ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. 

నూతన దర్శకుడు రమణ తేజ తెరకెక్కించిన ఈ సినిమాను నాగ శౌర్య సొంతం సంస్థ ఐరా క్రియేషన్స్ నిర్మించింది. నాలుగు రోజులకు గాను ఈ చిత్రం 11.95 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసినట్లు చిత్ర వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. ఇక ఐదు రోజులకి గాను  13.65 కోట్లు గ్రాస్ ను కలెక్ట్ చేసినట్లు చెబుతున్నారు. అశ్వద్ధామ థియేట్రికల్ రైట్స్ 6.5 కోట్లకు అమ్ముడుపోయాయి. 

దీంతో ఈ సినిమా అన్ని చోట్లా బ్రేక్ ఈవెన్ కు చేరుకుంది. ఈ నాన్ థియేట్రికల్ హక్కుల ద్వారా డీసెంట్ అమౌంట్ వచ్చింది. మొత్తంగా నాగ శౌర్య కెరీర్ లో ఈ సినిమా ప్రత్యేకంగా నిలిచిపోనుంది. ఈ సినిమా ఇంకా డీసెంట్ రన్ కొనసాగిస్తున్న వేళ అశ్వద్ధామ ఫైనల్ గా ఎంత వసూలు చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

More Related Stories