English   

విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ ట్రైలర్ రివ్యూ..

World Famous Lover Trailer
2020-02-06 16:56:08

ఏదైనా సినిమా గుర్తింపు తీసుకొచ్చినపుడు అందులోంచి అంత త్వరగా బయటికి రారు హీరోలు. విజయ్ దేవరకొండను చూస్తుంటే ఇప్పుడు ఇదే అనిపిస్తుంది. ఈయన అర్జున్ రెడ్డి చేసి మూడేళ్లు గడుస్తున్నా కూడా ఇప్పటికీ అదే ధ్యాసలో ఉన్నాడు. తాజాగా ఈయన నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ ట్రైలర్ విడుదలైంది. ఇది చూసిన తర్వాత అర్జున్ రెడ్డికి సీక్వెల్ చూస్తున్నట్లు అనిపిస్తుంది. టీజర్ లోనే నలుగురు అమ్మాయిలతో లవ్ చూపించిన దర్శకుడు క్రాంతి మాధవ్.. ఇప్పుడు కూడా ఈ ప్రేమను ఇంకాస్త ఎక్కువ చేసి చూపించాడు. 

ఈ లోకంలో అన్నింటికంటే స్వచ్చమైనది ప్రేమ అంటూ మొదలైన ట్రైలర్.. ఆ తర్వాత ఒక్కో అమ్మాయిలతో ఉన్న రిలేషన్ ను బయటపెట్టాడు. భార్యగా ఐశ్వర్య రాజేష్.. ఫ్యాంటసీగా కేథిరన్.. ప్రేయసిగా రాశీ ఖన్నా.. గాళ్ ఫ్రెండ్ గా ఎజిబెల్లా నటించారు. ఫస్ట్ లుక్ నుంచే వరల్డ్ ఫేమస్ లవర్ ఎలా ఉంటాడో క్లారిటీ వచ్చేసింది. సినిమాలో లుక్ చూసి ఫ్యాన్స్ కూడా ఇదే అన్నారు. ఇందులో కొత్తదనం ఏం లేదు.. మళ్లీ అదే చేస్తున్నావా విజయ్ అంటూ ట్రోల్ కూడా చేసారు. ఓనమాలు తర్వాత మళ్లీ మళ్లీ ఇది రానిరోజు లాంటి సినిమా చేసిన క్రాంతి.. ఉంగ‌రాల రాంబాబుతో డిజాస్ట‌ర్ ఇచ్చాడు. 

ఇదిలా ఉంటే ఇప్పుడు విజ‌య్ ఉన్న పొజిష‌న్ ప్ల‌స్ క్రేజ్ ను క్రాంతి ఎంత‌వ‌ర‌కు హ్యాండిల్ చేస్తాడు అనేది అంద‌ర్లోనూ ఉన్న అనుమానం. అయితే ఇక్క‌డ మ‌రో అడ్వాంటేజ్ కూడా ఉంది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు ద‌ర్శ‌కుల‌ను రెస్పెక్ట్ చేయ‌డం బాగా తెలుసు. క‌థ డిమాండ్ చేస్తే కాళ్లు ప‌ట్టుకోడానికి కూడా సిద్ధంగానే ఉంటాడు ఈ హీరో. గీత‌ గోవిందంలో కూడా ఇదే చేస్తాడు విజ‌య్. ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజుకి తన సినిమాను తీసుకొస్తున్నాడు విజయ్ దేవరకొండ. మొత్తానికి వరల్డ్ ఫేమస్ డే రోజే వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా కూడా విడుదల కానుందన్నమాట. కేయస్ రామారావు సినిమాను నిర్మిస్తున్నారు.

More Related Stories