విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం.. ఇదే నా చివరి ప్రేమకథ..

విజయ్ దేవరకొండ సినిమా అంటేనే ఇలా ఉంటుందనే అంచనాకు వచ్చేస్తున్నారు ప్రేక్షకులు. అందులో ముఖ్యంగా లవ్ స్టోరీలకు ఫేమస్ అయిపోయాడు విజయ్. అందుకే వరల్డ్ ఫేమస్ లవర్ అంటూ సినిమా కూడా చేస్తున్నాడు. అయితే ఎప్పుడు లవ్ స్టోరీ చేసినా కూడా అర్జున్ రెడ్డి చేస్తున్నాడంటూ విమర్శలు కూడా మూట గట్టుకుంటున్నాడు విజయ్. దాంతో ఇప్పుడు ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడు ఈయన. ఇకపై తన నుంచి ప్రేమకథలు రావని తేల్చేసాడు ఈ హీరో. వరల్డ్ ఫేమస్ లవర్ తర్వాత పూర్తిగా ప్రేమకథలకు దూరంగా ఉంటానని అనౌన్స్ చేసాడు. ఇది చూసి అభిమానులు కూడా షాక్ అవుతున్నారు. తన నిర్ణయాన్ని వెంటనే అప్లై చేసాడు కూడా. వరల్డ్ ఫేమస్ లవర్ తర్వాత ఇప్పుడు ఈయన ఫైటర్ సినిమా చేస్తున్నాడు. పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పూర్తిగా యాక్షన్ ఓరియెంటెడ్ రోల్ చేస్తున్నాడు విజయ్. ఆ తర్వాత కూడా శివ నిర్వాణతో మాస్ సినిమానే చేయబోతున్నాడు. దాంతో పాటు ఇకపై కమిట్ అయ్యే ప్రతీ సినిమాలో కూడా ప్రేమకథలు ఉండవని తేల్చేసాడు విజయ్. కథ మధ్యలో ప్రేమ ఉంటుందేమో కానీ ప్రేమే కథగా మాత్రం ఉండదని చెప్పేసాడు. ఇప్పటి వరకు ఈ హీరో చేసిన సినిమాల్లో 90 శాతం హార్ట్ హిట్టింగ్ ప్రేమకథలే. దాంతో అన్ని అర్జున్ రెడ్డి మాదిరే ఉన్నాయనే విమర్శలు ఎదుర్కొంటున్నాడు ఈ హీరో. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఏదేమైనా కూడా విజయ్ దేవరకొండ తీసుకున్న నిర్ణయంతో చాలా మంది దర్శకులు డైలమాలో పడిపోవడం ఖాయం.