English   

ట్రాక్ మార్చిన దిల్ రాజు.. షాక్‌లో అభిమానులు..

dilraju
2020-02-07 04:58:22

తెలుగు ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాతల్లో దిల్ రాజు ఎప్పుడూ ముందు వరసలోనే ఉంటాడు. ఒకప్పుడు రామానాయుడు.. ఆ తర్వాత అల్లు అరవింద్, సురేష్ బాబు.. ఈ తరానికి దిల్ రాజు.. అలా సెట్ అయిపోయాడు ఈయన. తన ఇమేజ్.. బ్రాండ్ నేమ్ తోనే సినిమాలు విజయం సాధించేలా చేయడం రాజుగారి ప్రత్యేకత. పైగా ఈయన కథల ఎంపికలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఒక్కసారి దిల్ రాజు ఆమోద ముద్ర పడిందంటే మాత్రం ఆ సినిమాకు తిరుగుండదు అంటారు. అలాంటి రాజుగారు ఇప్పుడు మాత్రం పూర్తిగా అరువు కథలపై పడ్డాడు. సొంత కథలు మానేసి.. రీమేక్ సినిమాలపై ఫోకస్ చేస్తున్నాడు ఈయన. ప్రస్తుతం శర్వానంద్, సమంత జంటగా నటించిన జాను సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు ఈయన. ఈ సినిమా తమిళనాట సంచలన విజయం సాధించిన 96కి రీమేక్. ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. మరోవైపు అలాగే హిందీలో సూపర్ హిట్ అయిన పింక్ సినిమాను పవన్ కళ్యాణ్ హీరోగా రీమేక్ చేస్తున్నాడు దిల్ రాజు. వేణు శ్రీరామ్ దీనికి దర్శకుడు. మే 15న ఈ సినిమా విడుదల కానుంది. ఈ రెండు సినిమాలు ఇలా ఉంటే.. హిందీలోనూ ఓ రీమేక్ చేస్తున్నాడు ఈయన. నాని హీరోగా విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్ విజయాన్ని కూడా సాధించిన జెర్సీ సినిమాను హిందీలో అల్లు అరవింద్ తో కలిసి రీమేక్ చేస్తున్నాడు ఈ నిర్మాత. షాహిద్ కపూర్ హీరోగా వస్తున్న ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. మొత్తానికి 2020లో మూడు రీమేక్ లతో రానున్నాడు దిల్ రాజు.

More Related Stories